సినిమాలు చేయకపోవడానికి కారణం అదే: రజినీకాంత్
X
విడుదల కాకుముందే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా జైలర్. ఆ సినిమాలోని కావాలయ్య పాట ఎంత హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా నటిస్తోంది. రమ్యకృష్ణ, జాకీ ప్తాఫ్, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చైన్నైలో జైలర్ సినిమా ఆడియో లాంచ్ ను ఏర్పాటుచేశారు. దానికి హాజరైన రజినీకాంత్ వేదికపై మాట్లాడుతూ.. తను సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని వివరించాడు.
‘అన్నాత్తే (పెద్దన్న) సినిమా తర్వాత చాలా కథలు విన్నా. కానీ, అందులో నాకు సూటయ్యే కథ దొరకలేదు. నా సినీ కెరీర్ ఇంతలా ఎదగడానికి డైరెక్టర్లే. సినిమాలకు నిర్మాతలు అమ్మలాంటి వారు. డైరెక్టర్లు తండ్రిలాంటివారు. నా కెరీర్ లో ముత్తురామన్, శంకర్, కె.ఎస్. రవికుమార్, కార్తిక్ సుబ్బరాజు, పా. రంజిత్, బాలు మహేంద్ర, సురేశ్ కృష్ణ, పి. వాసులాంటి వాళ్ల నన్ను హీరాగా పెట్టి గుర్తింపునిచ్చారు. ఆ జాబితాలో ఇప్పుడు నెల్సన్ చేరాడు’ అని అన్నాడు. 2021 నవంబర్ లో పెద్దన్న విడుదలైంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత జైలర్ సినిమాతో రాబోతున్నాడు రజినీ. కాగా, ఈ సినిమా ఆగస్ట్ 10 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.