మరో రెండు రోజుల్లో 300 కోట్ల క్లబ్ లోకి జైలర్ మూవీ
X
రజనీకాంత్ మూవీ జైలర్ జైత్రయాత్ర చేస్తోంది. భోళాశంర్ మూవీ ఫ్లాప్ అవడంతో ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది. అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ ను బద్ధలుకొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.
జైలర్ విడుదల అయి ఇప్పటికి మూడు రోజులు కానీ ఎక్కడా తగ్గడం లేదు. కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. నాల్గవ రోజుకి 222 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరో రోజు, రెండు రోజుల్లో 300 మార్క్ ను దాటేస్తుందని చెబుతున్నారు సినీ పండితులు. దాంతో పాటూ చాలా వేగంగా 300 మార్క్ ను అందుకున్న రెండవ తమిళ సినిమాగా జైలర్ నిలవనుంది. అంతకు ముందు రజనీకాంత్ దే రోబో 2.0 మొదటి స్థానంలో నిలిచింది.
జైలర్ విడుదల అయిన రోజే 48.35 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అలా రెండవ రోజు 25.75, 3వ రోజు 35, నాల్గవ రోజు 38 కోట్లు రాబట్టింది. మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్ ఇప్పటివరకు 127 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ విజయంతో నెల్సన్ దిలీప్ కుమార్ కి కూడా మంచి పేరు వచ్చింది. అతని మొదటి సినిమా మృగం ఫ్లాప్ అయింది. దీంతో జైలర్ కూడా ఆడుతుందా అేదా అనుకున్నారు. కానీ ఎట్టకేలకు రజనీ మ్యాజిక్ బాగా పనిచేసి జైలర్ సూపర్ హిట్ గా నిలిచింది. విక్రమ్ లాంటి సినిమాలను పోలి ఉందని టాక్ వచ్చినా... జైలర్ ను బాగా ఆదరిస్తున్నారు సినీ ప్రియులు.