రజినీకాంత్ సేఫ్ గేమ్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నాళ్లుగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనే ప్రధానంగా ఉండే కథలకంటే తను సెంటర్ పాయింట్ గా ఉంటూ ఇంకొన్ని పాత్రలూ ప్రధానంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అలా వచ్చిన జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నిజానికి ఈ మూవీలో మరీ గొప్పగా చెప్పుకునేంత బలమైన కంటెంట్ కూడా ఏం లేదు. బట్ డిఫరెంట్ స్టార్ కాస్టింగ్ ఉండటం వల్ల వారి ఫ్యాన్ బేస్ కూడా ప్లస్ అవడం వల్ల రీచ్ డబుల్ నుంచి త్రిబుల్ అయింది. అదే ప్రయత్నం అంతకు ముందు కబాలి, కాలా వంటి సినిమాల్లో చేశాడు. కానీ అప్పుడు స్టార్స్ ఎక్కువగా లేరు. జైలర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు మరోసారి అదే చేస్తున్నాడు. సంక్రాంతికి రాబోతోన్న ‘లాల్ సలామ్’ చిత్రానికి ఇదే జరిగింది. భారీ తారాగణం ఏం లేదు కానీ.. విష్ణు విశాల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇక జై భీమ్ ఫేమ్ టిజి గ్నానవేల్ రాజా డైరెక్ట్ చేయబోతోన్న సినిమాకు మాత్రం అనూహ్యంగా అత్యధిక స్టార్ కాస్ట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
రజినీకాంత్ తో పాటు అబితాబ్ బచ్చన్ ను ముందు ప్రకటించారు. ఇక వరుసగా ఇందులో నటించే ఆర్టిస్టులను అనౌన్స్ చేస్తున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం సర్ ప్రైజ్ అవుతోంది. సౌత్ లోని అన్ని భాషలను కవర్ చేస్తున్నట్టుగా తెలుగు నుంచి రానాను తీసుకున్నారు. మళయాలం నుంచి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ను తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరూ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లగల సత్తా ఉన్నవాళ్లే.
ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్స్ లోనూ మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి వారిని తీసుకున్నారు. వీళ్లంతా టాలెంటెడే. ఓ రకంగా ఈ వయసులో ఒకప్పటిలా రజినీకాంత్ ఇప్పుడు ఫైట్లు డ్యాన్సులు చేయలేడు. ఆ విషయంలో ఇలా యంగ్ స్టర్స్ హెల్ప్ తీసుకుంటే తను సెంటర్ పాయింట్ గా ఉంటూ కథను ముందుకు నడిపించొచ్చు అన్నమాట. మరి ఈ విషయంలో ఇతర ఓల్డ్ హీరోలు కూడా ఆదర్శంగా తీసుకుంటే మంచి కథలు చెప్పొచ్చు. లేదూ ఇంకా మేం కుర్రాళ్లమే అని రెచ్చిపోతే.. అంతే సంగతలు అని ఈ మధ్యే వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు నిరూపిస్తున్నాయి కదా..