Home > సినిమా > టీ అమ్ముకుని బతుకుతున్న రజనీకాంత్.. వీడియో వైరల్!

టీ అమ్ముకుని బతుకుతున్న రజనీకాంత్.. వీడియో వైరల్!

టీ అమ్ముకుని బతుకుతున్న రజనీకాంత్.. వీడియో వైరల్!
X

రజనీకాంత్ ఏమిటి? టీ అమ్ముకునే ఖర్మేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. పూర్తి వివరాల్లోకి వెళ్లకుండా ఈ వార్తలోని వీడియోను చూడండి. మీరు విస్తుపోవడంలో వింతేమీ లేదు. మాసిపోయిన చొక్కా, షార్ట్స్ ధరించి అత్యంత సామాన్య మానవుడిగా కనిపిస్తున్నాడు కదూ రజనీకాంత్! ఫేస్ కట్, బాడీ కట్, జుట్టు, వయసు, హావభావాలు అన్నింటా అచ్చం తలైవాను తలపిస్తున్నా ఇతడు రియల్ రజనీకాంత్ కాదు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చాయ్ అమ్ముకుంటున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. కేరళ రజనిగా ప్రఖ్యాతిగాంచిన ప్రభు వీడియో తాజాగా సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. చప్పున చూసిన జనం రజినీనే ఏదో షూటింగ్‌లో బాతాఖానీ కొడుతున్నాడని పొరపాటు పడుతున్నారు. నిజం తెలిసి నోరెళ్లబెడుతున్నారు.

ఫోర్ట్ కొచ్చిలోని పత్తలంలో ప్రభు టీకొట్టు నడుపుతున్నారు. అతనిలో తలైవా పోలికలు ఉన్నాయని మొదట మలయాళ నటదర్శకకుడు నాదీర్షా గుర్తించాడు. తర్వాత అతని ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అచ్చం రజనీకాంత్ లా ఉండే వాళ్లు మనదేశంలోనే కాదు పాకిస్తాన్ లోనూ ఉన్నారు. రెహ్మత్ గాస్కోరీ అనే రిటైర్డ్ ఉద్యోగి అచ్చం రజినీలాగే ఉంటాడు. స్టైల్ కూడా తలైవాదే. ఇక అసలు రజనీ సంగతికి వస్తే జైలర్ మూవీతో బంపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం 170వ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు..

Updated : 24 Oct 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top