Home > సినిమా > అది నా అలవాటు.. అలాగే చేస్తాను..' ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన రజనీ

అది నా అలవాటు.. అలాగే చేస్తాను..' ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన రజనీ

అది నా అలవాటు.. అలాగే చేస్తాను.. ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన రజనీ
X

సూపర్ స్టార్ రజినీకాంత్.. గత కొద్ది రోజులుగా సోషల్​మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. జైలర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పార్టీకి చెందిన నేతలకు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత యూపీ సీఎం కాళ్లు మొక్కిన విపరీతంగా వైరల్ అయింది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పెద్ద ఎత్తు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు రజనీ. యోగీ కాళ్లు మొక్కడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశావ్ అంటూ తమిళ అభిమానులు మండిపడ్డారు. ఇక రెండ్రోజుల పాటు రజినీ మీద చర్చోపచర్చలు జరిగాయి. రజినీ చేసింది తప్పు అని కొందరు అంటే.. ఇంకొందరు మాత్రం దాన్ని సమర్థించారు.. యోగి సీఎం అని కాళ్లు మొక్కలేదు.. అతనొక మత గురువు, పీఠాధిపతి అందుకే ఆయన కాళ్లు మొక్కాడు.. అంతే తప్ప సీఎం కదా?.. పవర్ ఉంది కదా? అని కాళ్లు మొక్కలేదు అని ఓ వర్గం రజినీ చర్యను సమర్థిస్తూ వచ్చింది.

అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు రజినీకాంత్ . తన హిమాలయాల ట్రిప్ ముగించుకొని, చెన్నై ఎయిర్ పోర్టులో అడిగిపెట్టిన ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. "యోగి, సన్యాసుల పాదాలను తాకి, వారి ఆశీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నాకన్నా చిన్నవారైనా ఇలానే చేస్తాను. అదే ఇప్పుడు కూడా చేశాను" అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అలాగే 2024లో తమిళనాడులో జరగబోయే లోక సభ ఎలెక్షన్స్​ గురించి అడగగా.. తాను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనుకోవట్లేదని పేర్కొన్నారు. ఇకపోతే రజనీకాంత్​ చాలా కాలం తర్వాత 'జైలర్'​ చిత్రంతో మళ్లీ ఫామ్​లోకి వచ్చారు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన10 రోజుల్లోనే రూ.500కోట్లు క్రాస్ చేసి రూ.600కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇంకా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతోంది.

Rajinikanth responds On Controversy With Touching Yogi Adityanath Feet

Tamil superstar Rajinikanth , clarified , Uttar Pradesh Chief Minister, touched Yogi Adityanath's, BJP leader in Lucknow , habit of touching feet , sanyasi or yogi, , Rajinikanth , Chennai airport.

Updated : 22 Aug 2023 10:08 AM IST
Tags:    
Next Story
Share it
Top