Rajinikanth emotional: మమ్మల్ని పోల్చి చూడొద్దు.. ట్రోలింగ్స్పై రజనీకాంత్ కంటతడి
X
సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ పోషించిన తాజా చిత్రం లాల్ సలామ్. విష్ణు విశాల్ హీరోగా వస్తున్న ఈ సినిమాను రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డైరెక్టర్ ఐశ్వర్య.. రజనీకాంత్ పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. ‘సోషల్ మీడియాలో వస్తున్న నెగటివిటీ గురించి నా టీం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. వాటిని చూసి చాలాసార్లు ఆగ్రహానికి గురయ్యా. మేం కూడా మనుషులమే. మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్య కొత్తగా నా తండ్రిని ‘సంఘీ’ (ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతిచ్చే వ్యక్తిని అలా పిలుస్తారు) అంటూ విమర్శిస్తున్నారు. మా నాన్ని సంఘీ కాదు. అలా అయితే.. ఆయన లాల్ సలామ్ లో ఎందుకు నటిస్తార’ని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. ఐశ్వర్య మాటలు విన్న రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
జైలర్ సినిమా ఈవెంట్ లో రజనీకాంత్ అర్థమైందా రాజా.. అంటూ డైలాగ్ వేశారు. దాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఆయనను విమర్శిస్తున్నారు. కాగా ఐశ్వర్య అనంతరం మాట్లాడిన రజనీకాంత్.. తప్పుగా అర్థం చేసుకుని విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు. వారు చేస్తున్న విమర్శలు తనను పరోక్షంగా బాధించాయన్నారు. తాను విజయ్ ని అనలేదని, అతను తన కళ్లముందు పెరిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ‘టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చా. నేను ఎవరికి పోటీ కాదు. నాకు నేనే పోటీ. మమ్మల్ని ఒకరితో ఒకరిని పోల్చి చూడొద్దు. అభిమానులకు చెప్తుంది ఒకటే’అని రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు.
ரஜினிகாந்த் சங்கி கிடையாது" - ஐஸ்வர்யா ரஜினிகாந்த் #AishwaryaRajinikanth | #Rajinikanth𓃵 | #LalSalaamAudioLaunch | #LalSalaam pic.twitter.com/fDF2Bfa1jg
— Jerold (@Jerold25961839) January 26, 2024