Home > సినిమా > తలైవ దెబ్బకి మెగాస్టార్ అవుట్..

తలైవ దెబ్బకి మెగాస్టార్ అవుట్..

తలైవ దెబ్బకి మెగాస్టార్ అవుట్..
X

గత వారం ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్‎లోకి ఎంట్రీ ఇవ్వడంతో..ఆడియెన్స్ ఎంతో సంబరపడ్డారు.. అయితే ఇద్దరు హీరోల్లో ఒకరు హిట్ కొట్టగా..మరొకరు ప్లాప్ అందుకున్నారు. జైలర్‎తో రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపారు. 2023 సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‎గా జైలర్ నిలిచింది. ఇండిపెండెన్స్ డే కూడా కలిసి రావడంతో. ఈ చిత్ర వసూళ్లు నాలుగు వందల కోట్లు దాటేశాయి. దీనితో జైలర్ అద్భుతాలు స్పష్టించింది. బీస్ట్ మూవీతో విమర్శలపాలైన దర్శకుడు నెల్సన్ జైలర్‎తో కమ్ బ్యాక్ అయ్యాడు. భారీ బ్లాక్ బస్టర్‎ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉంటె భోళా శంకర్‎పై చిరు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ చిత్రం మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది .గతంలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‎గా నిలిచింది. ఈ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాత్రలు, కథా నేపథ్యం, ఇతర పాత్రల చిత్రీకరణ బాగున్నా..కథనాన్ని మాత్రం మెహర్ రమేష్ చాలా స్లోగా నడిపాడని..దీనికి తోడు పాత్రల సంఖ్య ఎక్కువ కావడం ,అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదని అంటున్నారు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్‎గానే సాగాయని ..అవే సినిమాను దెబ్బతీశాయని టాక్ వినిపిస్తోంది. భోళా శంకర్ నెగిటివ్ టాక్‎తో..కొన్ని ధియేటర్స్‎లో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. ఆ స్థానంలో జైలర్ సినిమా వేయనున్నట్టు తెలుస్తుంది..

జైలర్ విషయానికి వస్తే తెలుగులో జైలర్ 23 కోట్ల షేర్‌, 40 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది. జైల‌ర్‎కు తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం 13 కోట్లు మాత్రమే .. కానీ వీటిని మూడో రోజుకే ర‌జ‌నీకాంత్‌ బ్రేక్ చేశారు. ప్ర‌స్తుతం లాభాలతో జైల‌ర్ ముందుకు దూసుకుపోతున్నాడు .ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు జైల‌ర్ 400 కోట్ల క్ల‌బ్‎లో చేరింది. దాదాపు 170 కోట్ల షేర్‌, 400 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది. ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 124 కోట్లు... అయితే మూడో రోజు వ‌సూళ్ల‌తో టార్గెట్ పూర్తి అయింది. ఇక భోళా శంక‌ర్ ముందుగా చెప్పుకున్నట్టు క‌నీసం మెగా ఫ్యాన్స్‎ను మెప్పించ‌లేక‌పోయింది. క‌లెక్ష‌న్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి. వీకెండ్ పూర్తి అయ్యే టైమ్‏కు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 33 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్‎గా 40కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండిపెండెన్స్ డే హాలిడే కూడా భోళా శంక‌ర్‎కి కలసి రాలేదు ..ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80 కోట్లు. ఈ టార్గెట్‎ను రీచ్ అవ్వాలంటే దాదాపు అసాధ్యమే..నిర్మాతలకి 50 కోట్ల వరకు నష్టాలు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి .


Updated : 17 Aug 2023 3:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top