Home > సినిమా > Jailer OTT Release : OTTలోకి జైలర్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే..?

Jailer OTT Release : OTTలోకి జైలర్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే..?

Jailer OTT Release : OTTలోకి జైలర్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే..?
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జైలర్’. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలైంది. మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న జైలర్.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. 4 రోజుల్లోనే రూ.350కోట్లు రాబట్టిన ఈ మూవీ.. రెండు మూడ్రోజుల్లో రూ.500 క్లబ్ లో చేరడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తున్న జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. జైలర్ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న 28 రోజుల తరువాత ఓటీటీలో రిలీజ్ కానుంది. జైలర్ ఓటీటీ రైట్స్ ను సన్ నెక్స్ట్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఓటీటీల్లోనూ సెప్టెంబర్ 7 నుంచి రజనీకాంత్ మూవీ స్ట్రీమింగ్ కానుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.





జైలర్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. రమ్య కృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో మళయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ అతిధి పాత్రల్లో కనిపించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.




Updated : 15 Aug 2023 5:37 PM IST
Tags:    
Next Story
Share it
Top