Rakesh Master : హనుమాన్ సినిమాలో రాకేశ్ మాస్టర్.. యాక్టింగ్ ఇరగదీశాడు
X
తాజాగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా.. రికార్డ్ కొల్లగొడుతుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అన్ని విభాగాల్లో సినిమా బాగుందని, హనుమంతున్ని చూపించిన విధానానికి డైరెక్టర్ కు ప్రేక్షకులు హాట్స్ఆఫ్ చెప్తున్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ యాక్టర్ తమ బెస్ట్ ఇచ్చారు. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ పర్సన్ యాక్ట్ చేశాడు. అతనే రాకేశ్ మాస్టర్. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హనుమాన్ సినిమాలో ఊరి పెద్దగా ఉన్న వ్యక్తి దగ్గర పులిరాజు అనే కామెడీ రౌడీ పాత్రలో నటించారు రాకేశ్ మాస్టర్. సినిమా మొత్తంలో రెండు మూడు సార్లు కనిపించిన రాకేశ్ మాస్టర్.. తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించాడు. హనుమాన్ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలుకాగా.. ఆ టైంలో రాకేశ్ మాస్టర్ సినిమాలో నటించారు. అప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఆయన మరణించాక సినిమా రిలీజ్ అవ్వడం కాస్త బాధ కలిగిస్తుందని అభిమానులు అంటున్నారు. రాకేశ్ మాస్టర్ మన మధ్య లేకపోయినా.. హనుమాన్ సినిమాలో మళ్లీ ఆయనను చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్తున్నారు.