Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ -జాకీ భగ్నానీ పెళ్లి కార్డు మాములుగా లేదు
X
బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh).. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ ఈ నెల 21న పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహనికి సంబంధించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్‌దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రింట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. పనిలో పనిగా అక్కడే ప్రేమలో కూడా పడింది రకుల్. జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) ప్రేమలో పడినట్టు రకుల్ 2021 లోనే ప్రకటించింది. అప్పట్నుంచి వీరిద్దరూ ప్రేమలోనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న రకుల్, జాకీ తమ పెళ్లికి సంబంధించి గోవాను ఎంచుకున్నారు. దీని వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది. వారిద్దరూ ప్రేమలో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్ (Bollywood)లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫాల్తు, అజాబ్ గజాబ్ లవ్, రాంగ్రేజ్, యంగిస్థాన్ వంటి సినిమాల్లో నటించాడు. 2009లోనే కన్నడ మూవీ గిల్లీ(Kannada movie Gilli)తో రకుల్ సినీ అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత యారియాన్ సినిమా (Yariyan movie) తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనంతరం దేదే ప్యార్ దే, రన్‌వే 34, చాత్రివాలీ, ఐ లవ్ యూ, డాక్టర్ జీ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి అభిమానుల మనసులు చూరగొంది. జాకీ భగ్నానీ (Jackie Bhagnani) పెళ్లి ఫిబ్రవరి 22న జరగబోతున్నట్టు తెలుస్తుంది. గోవాలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. కేవలం ఫ్యామిలీ, పలువురు సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుకలు జరిపి అనంతరం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసి బాలీవుడ్ అందర్నీ పిలుస్తారని సమాచారం. అయితే పెళ్లిపై అధికారికంగా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ.. ఇంకా స్పందించలేదు. తాజాగా ఓ ఆసక్తికర విషయం కూడా వినిపిస్తుంది. రకుల్ – జాకీ భగ్నానీ మొదట తమ పెళ్లిని దుబాయ్ కానీ, మాల్దీవ్స్ లో కానీ చేసుకోవాలనుకున్నారట. కానీ ఇటీవల మాల్దీవ్స్ ఇష్యూ, ప్రధాని మోదీ (Pm modi) ఇండియా టూరిజం అభివృద్ధి గురించి మాట్లాడటం చూసాక ఈ జంట మనసు మార్చుకున్నారట. అంతేకాకుండా రకుల్ – జాకీ భగ్నానీల ప్రేమ గోవాలోని మొదలైందని, ఆ తర్వాత వీళ్ళు చాలాసార్లు గోవా వచ్చి ఎంజాయ్ చేసారని, అందుకే పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.