Home > సినిమా > Rakul Marriage : రకుల్ -జాకీ పెళ్లి ఫోటోలు వైరల్..ఎలా మెరిసిపోతున్నారో చూశారా?

Rakul Marriage : రకుల్ -జాకీ పెళ్లి ఫోటోలు వైరల్..ఎలా మెరిసిపోతున్నారో చూశారా?

Rakul Marriage : రకుల్ -జాకీ పెళ్లి ఫోటోలు వైరల్..ఎలా మెరిసిపోతున్నారో చూశారా?
X

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె పెళ్లి ప్రియుడు జాకీ భగ్నాని పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి మ్యారేజ్ తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె అభిమానుల నిరీక్షణ ముగిసింది. రకుల్ స్వయంగా తాను మరియు జాకీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోలను పంచుకుంటూ, రకుల్ ఇలా రాసింది, ‘ఈ రోజు- ఈ భగ్నాని ఎప్పటికీ నావి. ❤️ 21-02-2024 అంటూ పేర్కొంది. ఇక. సెలబ్రిటీలు రకుల్ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, అతియా శెట్టి, వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, సమంతా రూత్ ప్రభు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో సహా పలువురు ప్రముఖులు రకుల్ మరియు జాకీకి శుభాకాంక్షలు తెలిపారు.

వధువు రకుల్ అలాగే వరుడు జాకీ భగ్నానీ పెళ్లి ఫొటోలలో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి కోసం పింక్ కలర్ లెహంగా ధరించింది. ఈ సమయంలో కూడా చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించి కనిపించింది. అలాగే ఆమె భారీ నగలతో కనిపించని. ఇక ఈ జంట షేర్ చేసిన ఫొటోలలో, జాకీ భగ్నాని రకుల్ ప్రీత్‌ను ప్రేమతో కూడిన కళ్లతో చూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీల ఈ వివాహ ఫోటోలు కొన్ని నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అందమైన జంటపై అభిమానులు చాలా ప్రేమను కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్‌ శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన ప్రేమ విషయాన్ని 2021లో రకుల్ బయటపెట్టింది.

Updated : 22 Feb 2024 7:00 AM IST
Tags:    
Next Story
Share it
Top