Home > సినిమా > అంగరంగ వైభవంగా రకుల్ - జాకీ పెళ్లి

అంగరంగ వైభవంగా రకుల్ - జాకీ పెళ్లి

అంగరంగ వైభవంగా రకుల్ - జాకీ పెళ్లి
X

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. వరుడు భగ్నానీ సంప్రదాయం పద్దతిలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్‌ శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన ప్రేమ విషయాన్ని 2021లో రకుల్ బయటపెట్టింది. అప్పటి నుంచి వీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు తన భర్తతో కలిసి రకుల్ న్యూలైఫ్ ప్రారంభించబోతోంది. మూవీల విషయానికి వస్తే.. రకుల్ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా చేస్తోంది. జాకీ విషయానికి వస్తే.. ఆయన నిర్మించిన 'బడే మియా చోటే మియా' ఈ ఈద్ కు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్‌ పండగకు థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనం జరిగాయి. పెళ్లికి వచ్చిన అతిథులు తాజాగా జరిగిన సంగీత్​లో సందడి చేశారు. బాలీవుడ్​ కపుల్స్​ వరుణ్‌ ధావన్‌ నటాషా, శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా ఇలా పలువురు స్టార్స్​ సంగీత్‌లో పాల్గొని స్టెప్పులేశారు. ఇక హల్దీ, మెహందీ వేడుకలు కూడా బాగా జరిగాయి. గతంలో ఈ జంట తమ ఫ్రెండ్స్​కు గ్రాండ్ బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఈ జంట వెడ్డింగ్ కార్డ్​ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకుకు ఆదిత్య రాయ్​ కపూర్​, అనన్య పాండే, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ దంపతులు, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని సమాచారం.


Updated : 21 Feb 2024 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top