Home > సినిమా > అల్లు అరవింద్ రామాయణంలో రకుల్ ప్రీత్.. ఏ క్యారెక్టర్ చేస్తుందో తెలుసా?

అల్లు అరవింద్ రామాయణంలో రకుల్ ప్రీత్.. ఏ క్యారెక్టర్ చేస్తుందో తెలుసా?

అల్లు అరవింద్ రామాయణంలో రకుల్ ప్రీత్.. ఏ క్యారెక్టర్ చేస్తుందో తెలుసా?
X

రకుల్‌ ప్రీత్‌ సింగ్.. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో మారుమ్రోగిన ఈ పేరు.. ఇప్పుడు కనిపించకుండా పోతుంది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్.. ఒకప్పుడు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మొదలు రవితేజ లాంటి స్టార్‌ హీరోల వరకు అందరితో నటించింది. టాలీవుడ్ లో ఫేమస్ అయి.. ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్‌కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్‌ కాకపోవడంతో.. అవకాశాలు తక్కువయ్యాయి. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా లేదు. తాజాగా తమిళ్ సినిమా అలయాన్ లో నటించింది. అయితే పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. వెబ్ సిరీస్ ల బాట పట్టింది. ఇక వెండి తెరకు రకుల్ దూరమైంది అనుకున్న టైంలో.. ఓ క్రేజ్ అప్ డేట్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి.. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం రకుల్ ను కలిసినట్లు తెలుస్తుంది. దానికి రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే లుక్ టెస్ట్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీత పాత్ర కోసం సాయిపల్లవి, జాన్వీకపూర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్ కనిపించనున్నట్లు సమాచారం. కాగా రకుల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జాకీ భగ్నానీతో రకుల్ పెళ్లి.. ఈనెల 22న గోవాలో జరగనుందట.

Updated : 10 Feb 2024 9:38 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top