ఆస్కార్ జ్యూరీలోకి రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్
X
నాటునాటు పాటలో ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ విజయ పరపరంపర కొనసాగుతూనే ఉంది. ఆస్కార్ అవార్డులను ఎవరికి ఇవ్వాలో తేల్చే జ్యూరీలో పలువురు తెలుగువాళ్లకు చోటు దక్కింది. 2023 ఆస్కార్ జ్యూరీలోకి ఆర్ఆర్ఆర్ బ్యాచ్‌ను తీసుకున్నారు. ఈ జ్యూరీ నిర్ణయంతోనే వచ్చే ఏడాది ఆస్కార్లు ఇస్తారు. మొత్తం 398 మంది కొత్త సభ్యులతో జ్యూరీలో ఏర్పాటైనట్లు ఆస్కార్ అవార్డుల కమిటీ తెలిపింది.
ఇందులో ‘నాటునాటు’ కోసం నాటుగా కష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కమార్, డిజైనర్ సాబు సిరిల్ ఉన్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్‌ను నిర్మాతల కేటగిరి నుంచి తీసుకున్నారు. చెర్రీ, టైగర్లను జ్యూరీలో చోటు దక్కడంతో వారి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. జ్యూరీలో ఇండియాకు చెందిన మణిరత్నం, గిరీశ్ బాలక్రిష్ణన్, కాంతిశర్మ, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు కూడా ఉన్నారు.