Ram Charan : విసిగిపోయిన రామ్ చరణ్.. ఆగిపోయిన గేమ్ ఛేంజర్
X
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ సినిమా ఆగిపోయింది. ఈ వార్త విని చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఖుషీగా ఫీలవుతున్నారు. లేకపోతే ఏంటీ..? అసలు చరణ్ లాంటి స్టార్ హీరోను శంకర్ ఏమన్నా పట్టించుకున్నాడా..? అడుగడుగునా అవమానించినట్టుగా.. ఈ సినిమాపై ఏ దశలోనూ పూర్తిగా శ్రద్ధ పెట్టలేదు. షూటింగ్ గురించే పట్టించుకోలేదు. అదేమంటే.. కోర్ట్ ఇష్యూస్ వల్ల భారతీయుడు2 చేయాల్సి వచ్చిందని కవరింగ్ ఒకటి. ఇప్పుడు భారతీయుడు2 షూటింగ్ అయిపోయింది. మరి ఇకనైనా గేమ్ ఛేంజర్ గురించి ఆలోచించాలి కదా.. బట్.. అతను అదేం పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ అంటే లెక్క లేదా లేక నిర్మాత దిల్ రాజు నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదా అనేది చెప్పలేం కానీ ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు మాత్రం బలంగానే వినిపిస్తున్నాయి. ఇంకా చెబితే శంకర్ వైఖరి నచ్చకపోవడం వల్ల రామ్ చరణే వద్దనుకున్నాడు అనేవాళ్లూ ఉన్నారు.
ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్స్ ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు శంకర్. మాగ్జిమం సినిమాలు బ్లాక్ బస్టర్స్ గానే నిలిచాయి. కానీ కొన్నాళ్లుగా అతను తన టచ్ ను కోల్పోయాడు. వస్తోన్న ప్రతి సినిమా నిరాశపరుస్తూనే ఉంది. అఫ్ కోర్స్ ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ కామనే. అయినా శంకర్ అనగానే విజయవంతమైన సినిమాలే కాదు.. షూటింగ్ చేస్తోన్న ప్రతి రోజూ బాధపడే నిర్మాతలు ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా గుర్తుకు రావాలి. అతని సినిమా అంటే అస్సలు ప్లానింగ్ ఉండదు అనే అపవాడు కోలీవుడ్ మొత్తం ఉంది. సెట్ లో ఎప్పుడు ఏది కావాలంటాడో ఎవరికీ తెలియదు. సడెన్ గా షూటింగ్స్ క్యాన్సిల్ చేస్తుంటాడు. కోట్లు ఖర్చు పెట్టి పాటలు తీస్తుంటాడు. ఇవన్నీ కూడా నిర్మాతకు ముందే చెప్పడు. ఇంత బడ్జెట్ తో సినిమా చేయాలి అనే రూల్ లో అతను ఉండడు. తనకు తోచింది తీస్తుంటాడు. ఎంత ఖర్చైనా నిర్మాతలు భరించాల్సిందే తప్ప.. బడ్జెట్ పెరుగుతుందని అడగకూడదు. ఈ ప్రాబ్లమ్ ను దిల్ రాజు కూడా ఫేస్ చేశాడట. మొదట శంకర్ కే దిల్ రాజు కండీషన్స్ పెట్టాడనీ.. ‘ఇంత బడ్జెట్ లోనే’ సినిమా పూర్తి చేయాలని ఒక ఫిగర్ అనుకున్నారనీ.. అందుకు శంకర్ కూడా ఒప్పుకున్నాడనీ చెప్పుకున్నారు. బట్ శంకర్ ఆ నిర్ణయానికి కట్టుబడలేదట. అందుకే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ఆగితేనే బావుండు అనుకుంటున్నాడు. అటు రామ్ చరణ్ కూడా చాలా సమయం వృథా చేసుకున్నాడు. అందుకే శంకర్ గేమ్ లో పావు కాలేక బుచ్చిబాబుతో సినిమా మొదలెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఒకవేళ ఎవరైనా మధ్యవర్తులు వచ్చి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ను సెట్ చేసినా.. ఈ సారి శంకర్ ను చరణ్ ఆడుకోవడం ఖాయం అని కూడా వినిపిస్తోంది. మరి ఈ గేమ్ ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.