అఫీషియల్‌గా వస్తోన్న క్రేజీ కాంబో..రంగస్థలం తర్వాత ఓ రేంజ్ మూవీ
X
అంతా ఊహించినట్టుగానే అఫీషియల్ గానే న్యూస్ వచ్చింది. రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఇప్పటికి ఫస్ట్ ప్లేస్ లో ఉండే సినిమా రంగస్థలం. ఈ మూవీ తర్వాతే చరణ్ లో ఓ మంచి నటుడు కూడా ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసింది. అలా తెలియజేయడంలో మేజర్ పార్ట్ దర్శకుడు సుకుమార్ దే అనేది కాదనలేని సత్యం. అందుకే ఈ కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని అప్పటి నుంచి అనుకుంటున్నారు.
అప్పట్లో రంగస్థలంకు సీక్వెల్ వస్తుందనుకున్నారు కూడా. సీక్వెల్ కాదు కానీ.. ఈ కాంబోలో మరో సినిమా రాబోతోంది. మొన్నటి వరకూ రూమర్స్ అనుకున్నారు కానీ.. అఫీషియల్ గానే అనౌన్స్ అయింది. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప2 చేస్తున్నాడు.
ఇది అవగానే చరణ్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ లోగా చరణ్ గేమ్ ఛేంజర్ తో పాటు బుచ్చిబాబు మూవీస్ ను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఈ క్రేజీ కాంబోలో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్నమాట. మరి ఈ సారి ఎలాంటి ఎపిక్ మూవీతో వస్తారో చూడాలి.