Home > సినిమా > మెగా ఫ్యామిలీలో సంబరాలు.. రేపే కొత్త మెంబర్ రాక!

మెగా ఫ్యామిలీలో సంబరాలు.. రేపే కొత్త మెంబర్ రాక!

మెగా ఫ్యామిలీలో సంబరాలు.. రేపే కొత్త మెంబర్ రాక!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్నారు. దాదాపుగా పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు ఉపాసన రేపు ప్రసవం కానున్నారని తెలుస్తోంది. డాక్టర్ సలహా మేరకు రేపు ఉదయం ఆమె ప్రసవం కానున్నారట. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలైయ్యాయి. పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మిను ఇవ్వబోతుండడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. 2012, జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జరిగింది. ఉపాసన.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు, శోభన, అనిల్ కామినేనిల కూతురు. ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఉపాసన డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్’కు బ్రేక్ ఇచ్చారట. ఈ కీలక సమయంలో ఉపాసన పక్కనే రామ్ చరణ్ ఉండాలని భావిస్తున్నారట. అంతేకాదు డెలివరీ తర్వాత కూడా ఓ కొన్ని నెలల పాటు రామ్ చరణ్ ఇంట్లోనే తన భార్య ఉపాసనకు సాయంగా ఉండాలని అనుకుంటున్నారట. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన బర్త్ డే సందర్భంగా RC15 టీమ్ గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్‌తో ఈ సినిమాను చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. కియారా అద్వానీ హీరోయిన్‌. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


Updated : 19 Jun 2023 2:27 PM IST
Tags:    
Next Story
Share it
Top