Home > సినిమా > Ram Charan : రామ్ చరణ్ సినిమాలో మరో టాప్ హీరో

Ram Charan : రామ్ చరణ్ సినిమాలో మరో టాప్ హీరో

Ram Charan : రామ్ చరణ్ సినిమాలో మరో టాప్ హీరో
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో మరో టాప్ హీరో యాడ్ అవుతున్నాడు. రామ్ చరణ్ నెక్ట్స్ మూవీకి మరో బిగ్ ఎసెట్ యాడ్ అవుతోంది. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకపోయినా కొన్నాళ్లుగా సోషల్ మీడియాతో పాటు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నగా ఎక్కువగా తెలిసిన శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న ఈ సారి గ్రాండ్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. కొన్నాళ్ల క్రితం బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణిలో చిన్న పాత్రలో కనిపించిన శివన్న ఈ సారి పెద్ద రోల్ తో వస్తున్నాడు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శివరాజ్ కుమార్ ను తీసుకున్నారు. ఈ విషయం శివన్నే స్వయంగా చెప్పడంతో గాసిప్ అనేందుకు ఆస్కారం లేకుండా పోయింది. రీసెంట్ గా ఒక కన్నడ ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న రామ్ చరణ్ సినిమా అని చెప్పాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

2023లో రజినీకాంత్ కు కబ్ బ్యాక్ మూవీగా చెప్పుకున్న జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ చేసిన నరసింహ పాత్రకు దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆయన మాస్ అప్పీరియన్స్ కు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.ఇక బుచ్చిబాబు తన ఫస్ట్ మూవీ ఉప్పెనలో కూడా విజయ్ సేతుపతిని తీసుకుని ఆశ్చర్యపరిచాడు. విజయ్ ఈ మూవీకి పెద్ద ఎసెట్ అయ్యాడు. మరి ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో శివరాజ్ కుమార్ పాత్ర ఎలా ఉంటుందో కానీ ఈ వార్త ఇప్పుడు వైరల్ అయిపోయింది.

Updated : 5 Jan 2024 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top