Home > సినిమా > Ram Charan : ఒకటికే దిక్కులేదు.. రెండోది అవసరమా రామ్ చరణ్..

Ram Charan : ఒకటికే దిక్కులేదు.. రెండోది అవసరమా రామ్ చరణ్..

Ram Charan : ఒకటికే దిక్కులేదు.. రెండోది అవసరమా రామ్ చరణ్..
X

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడిన తర్వాత ఏ స్టార్ హీరో అయినా ఆ జోష్ ను కంటిన్యూ చేస్తూ మంచి లైనప్ సెట్ చేసుకుంటాడు. రామ్ చరణ్ కూడా అదే చేసుకున్నాడు. బట్.. ఆ లైన్ ఎంతకీ ముందుకు కదలడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా స్టార్ట్ అయింది. బట్ ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇన్నాళ్లూ వెయిట్ చేసిన రామ్ చరణ్ ఇక బుచ్చిబాబుతో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. సరే ఇదైనా అవుతుందా అనుకుంటే ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తోంది. దీంతో పాటు రంగస్థలం పైనా వార్తలు వస్తున్నాయి. మరి ఈ గేమ్ ఏంటీ..? రంగస్థలం మేటర్ ఏంటీ..?

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ లైనప్ చూసి చాలామంది మనోడు ప్యాన్ ఇండియా రేంజ్ లో ఊపేస్తాడు అని భావించారు. అందుకు ప్రధాన కారణం శంకర్ తో సినిమాకు కమిట్ కావడమే. చాలా ఆర్భాటంగా మొదలైన ఈ మూవీ అర్థాంతరంగా ఆగిపోయింది. శంకర్ భారతీయుడు2 చేయాల్సిర రావడంతో అటు వెళ్లాడు. ఇక్కడ ఈ గేమ్ ఆగిపోయింది. కొన్నాళ్లు భారతీయుడు2 ఒక షెడ్యూల్, గేమ్ ఛేంజర్ ఒక షెడ్యూల్ లాగా షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు శంకర్. కానీ అది వర్కవుట్ కాలేదు. దీంతో పూర్తిగా భారతీయుడు2 పైనే ఫోకస్ చేశాడు. ఆ సినిమా పూర్తయింది. ఈ సమ్మర్ లోనే విడుదల. కానీ సడెన్ గా ఆ మూవీకి మరో పార్ట్ కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అదీ పూర్తయ్యాకే గేమ్ ఛేంజర్ వైపు వస్తాడు అని రూమర్స్ వినిపించాయి. ఈ కారణంగానే ఇక శంకర్ ను పక్కన పెట్టి బుచ్చిబాబుతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకు సిద్ధమయ్యాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మళ్లీ గేమ్ ఛేంజర్ కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎవరూ ఊహించనివి కావడం విశేషం.

ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఒక్కో సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారు. దేవర కూడా సడెన్ గా రెండు భాగాలుగా మారింది. అందుకే గేమ్ ఛేంజర్ ను కూడా రెండు భాగాలుగా చేయబోతున్నారు అనేదే కొత్త వార్త. అసలు ఒక్క పార్ట్ కే దిక్కులేదు అని ఫ్యాన్స్ అంతా ఫీలవుతుంటే.. వారిని ఇంకా రెచ్చగొట్టేలా ఉంది కదా ఈ వార్త. బట్ ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. కాకపోతే గేమ్ ఛేంజర్ కూడా రెండు భాగాలుగా వస్తుంది అనే వార్తలు మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.

మరోవైపు ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడట. యస్.. వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కు కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి వీరి కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న అభిమానులకు ఈ వార్త కిక్ ఇస్తుందనే చెప్పాలి. మరో విశేషం ఏంటంటే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ లాక్ అయిందట. అంటే సుకుమార్ చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం సుక్కూ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. పుష్ప2 ఈ యేడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ లోగా రామ్ చరణ్ శంకర్, బుచ్చిబాబు సినిమాల్లో ఏదో ఒకటి పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందట. ఏదేమైనా గేమ్ ఛేంజర్ మాత్రం రామ్ చరణ్ ను బాగా ఇబ్బంది పెడుతోందనే చెప్పాలి.


Updated : 27 Jan 2024 10:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top