సిస్టమ్‌కి సిక్స్ ప్యాక్ మొగుడొచ్చాడు జరగండి.. రామ్‌చరణ్ సాంగ్ రిలీజ్
X
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో కియారా అద్వానీ హిరోయిన్‌గా చేస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. చరణ్ బర్త్ డే సందర్భంగా నేడు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్‌లో విజువల్స్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మామూలుగా శంకర్ సినిమాలో సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని అందరికీ తెలుసు. ప్రస్తుతం రిలీజ్ అయిన జరగండి సాంగ్‌ను భారీ బడ్జెట్‌తో తీసినట్లు తెలుస్తోంది. రంగు రంగుల భవనాల మధ్యలో కలర్ ఫుల్ విజువల్స్ ఈ సాంగ్‌లో కనిపిస్తాయి. గల్ఫ్ కంట్రీస్‌లో ఒకటైన 'హైతీ' దేశ రాజధాని 'పోర్ట్ ఓ ప్రిన్స్'కి చెందిన లొకేషన్‌ని 'జరగండి' సాంగ్ కోసం సెట్ చేశారు. శంషాబాద్ లోని భారీ సెట్ వేసి మరీ శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు.
ఇందులో చరణ్‌తో కియారా వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాట కోసం రూ.16 కోట్లు ఖర్చు చేసి మరీ షూట్ చేశారట. ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా తెరకెక్కిన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట చరణ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.