శంకర్ భారీ స్కెచ్.. ఏడు రూపాల్లో హీరో గెటప్
X
ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న రామ్చరణ్.. తర్వాత శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి రకరకాల పేర్లు ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చాయి. అధికారి అని, కామన్ మ్యాన్ అని ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. చివరికి ఈ సినిమాకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి లీక్ అవుతున్న కొన్ని వార్తలు హైప్ ను పెంచుతున్నాయి. ఈ క్రమంలో మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్.. పొలిటిషియన్ గా, ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ చరణ్ తో ఏడు డిఫరెంట్ గెటప్స్ వేయిస్తున్నాడట. మామూలుగానే శంకర్ సినిమాలో హీరోలు రకరకాల గెటప్స్ లో కనిపించడం సహజమే. అయితే, రామ్ చరణ్ కోసం ఎలాంటి గెటప్స్ ను రాసుకున్నాడని ఆలోచిస్తున్నారు. అయితే, ఈ గెటప్స్ సినిమాల్లో ఉంటాయా.. లేక శంకర్ తీసే భారీ సెట్ లో ఉంటాయ అనే ప్రశ్నగా మిగిలిపోయింది.