రామ్ చరణ్- ఉపాసన దంపతుల బిడ్డను చూశారా.?
X
రామ్ చరణ్ సతీమణి ఉపాసన డెలివరీతో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మంగళవారం(జూన్ 20) తెల్లవారు జామున 1:49 గంటలకు శుభగడియల్లో పాప జన్మించిందని చిరంజీవి చెప్పారు. మెగా ఫ్యామిలీలోకి వారసురాలు రావడంపై టాలీవుడ్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్- ఉపాసన దంపతుల బిడ్డ ఫోటో బయటకొచ్చింది. హాస్పిటల్ లో ఆ పసిపాప ఫేస్ కనిపించేలా తీసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ మనవరాలిని ఇలా చూసి మెగా లోకం ఫిదా అవుతోంది. వెల్ కమ్ మెగా ప్రిన్సెస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీలోకి వారసురాలు రావడంపై.. లిటిల్ మెగా ప్రిన్సెస్ కి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. నీ రాకతో మెగా ఫ్యామిలీలో కొత్త ఉత్సాహం నెలకొందని అన్నారు. తల్లి దండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన.. తాతగా తనకు చాలా గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావాలని, మా చేతుల్లో బిడ్డను పెట్టాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నాం. అయితే ఇన్నేళ్ల తరవాత ఆ భగవంతుడి దయతో, అందరి అశీస్సులతో మా కోరిక నెరవేరిందని మెగాస్టార్ అన్నారు.
రామ్ చరణ్ దంపతులకు పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఈ బిడ్డ జన్మనిచ్చింది. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ ప్రచారం కూడా జరిగింది. అలాగే వీళ్ల ఇంటికి ఓ లిటిల్ ప్రిన్సెస్ వచ్చింది. ఉపాసన డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు.
Ram Charan, Upasana Kamineni daughter's first pic goes viral in Social Media
Ram Charan , Upasana Kamineni , Konidela Family, welcomed a baby girl , Chiranjeevi, grandfather , Mega Princess, Ram Charan and Upasana's daughter