రామ్‌చరణ్‌ని అవమానించలేదు..షారుఖ్ చెప్పింది డైలాగ్ మాత్రమే
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి నేషనల్, ఇంటర్నెషనల్ స్టార్స్ హాజరైయ్యారు. అయితే సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, అట్లీ మాత్రమే వెళ్లారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ లో ఈ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే స్టేజి పై నాటు నాటు సాంగ్ కి బాలీవుడ్ ఖాన్‌త్రయం షారుఖ్, ఆమిర్, సల్మాన్ డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. ముగ్గురు ఖాన్ లను చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఆ టైంలో రామ్ చరణ్ ను కూడా షారుఖ్ స్టేజీ పైకి పిలిచి వారితో పాటు నాటు నాటు సాంగ్ కి స్టెప్ వేయించాడు. అయితే ఆ వీడియోలో షారుఖ్, రామ్ చరణ్ ని పిలిచేటప్పుడు.. ఇడ్లీ, వడ రామ్ చరణ్ అంటూ పిలిచాడు. దీంతో షారుఖ్ పై రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ చరణ్ ని అవమానించాడని, వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు విషయం ఏంటంటే.. షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని చెప్పాడని షారుఖ్ అభిమానులు క్లారిటీ ఇచ్చారు.
షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘వన్ 2 కా 4’ మూవీలో డైలాగ్ అది. ఆ డైలాగ్ లో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి చెబుతూ.. ఇడ్లీ, వడ, రజినీకాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ చెప్తాడు. ఆ మూవీలో డైలాగ్ నే అంబానీ ఈవెంట్ లో చరణ్ పిలిచేటప్పుడు షారుఖ్ అన్నాడు. అయితే సౌత్ ఆడియన్స్ కి ఆ డైలాగ్ తెలియకపోవడంతో..చరణ్ ని అవమానించినట్లుగా భావించారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.