Home > సినిమా > 'బెడ్ రూమ్‎లో ఉన్న జగన్‎కు అవినాశ్ ఫోన్'..వర్మ సినిమాపై టీడీపీ తమ్ముళ్ల కామెంట్స్

'బెడ్ రూమ్‎లో ఉన్న జగన్‎కు అవినాశ్ ఫోన్'..వర్మ సినిమాపై టీడీపీ తమ్ముళ్ల కామెంట్స్

బెడ్ రూమ్‎లో ఉన్న జగన్‎కు అవినాశ్ ఫోన్..వర్మ సినిమాపై టీడీపీ తమ్ముళ్ల కామెంట్స్
X

వివాదస్పద సినిమాలు తీస్తూ, కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పడు హారర్ సినిమాలతో జనాలను భయపెట్టిన వర్మ..ఇప్పుడు రాజకీయ నాయకుల బయోపిక్స్‎ను తెరకెక్కిస్తూ రాజకీయాల్లో తన సినిమాల ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలు చేసిన వర్మ. ఈ సారి వ్యూహం అనే మరో వివాదస్పద సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం వ్యూహం సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వర్మ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తన ట్విటర్ అకౌంట్‎లో సినిమాకు సంబంధించిన పిక్స్ షేర్ చేసి నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు వర్మ. ఈ పిక్స్ చూసిన టీడీపీ తమ్ముళ్లు వర్మను ఓ రేంజ్‎లో ట్రోల్ చేస్తున్నారు.




వర్మ తీసే వివాదస్పద సినిమాలు ఎంత వరకు ప్రభావం చూపిస్తాయో తెలియదు కానీ ఆ సినిమాల విడుదలకు ముందు వర్మ చేసే హడావిడి మాత్రం అందరికీ రీచ్ అవుతుంది. ఈ సారి వర్మ ఏపీ పాలిటికిట్స్ పైన ఓ వివాదస్పద సినిమా తీస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను తీయనున్నారు. మొదటి భాగానికి వ్యూహం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రెండో దానికి శపథం అనే పేరును ఖరారు చేశారు. తాజాగా వర్మ మొదటి భాగం షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమాలోని క్యారెక్టర్స్ ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. ఇందులో జగన్ పాత్రలో అజ్మల్, జగన్ భార్య భారతి పాత్రలో మానస అనే నటి నటిస్తున్నారు. అజ్మల్ ఇది వరకే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలో జగన్ పాత్రను పోషించాడు. అది బాగా వర్కౌట్ కావడంతో ఈ సినిమాలోనూ అవకాశం వచ్చింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పైన దాసరి కిరణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా సీఎం జగన్‎కు అనుకూలంగా ఉండనుందని తెలుస్తోంది.

రామ్ గోపాల్ వర్మ ట్విటర్‎లో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారి తీస్తున్నాయి. టీటీపీ శ్రేణులు వర్మను ఓ రేంజ్‏లో ట్రోల్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన షేర్ చేసిన వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్‌లో ఉన్నట్టు భావిస్తున్న ఫోటోలపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో తనను ట్రోల్ చేస్తున్న వారి పోస్టులపై వర్మ ఘాటుగా స్పందిస్తున్నారు.

టీడీపీకి చెందిన ఓ ట్విట్టర్ అకౌంట్‌ను వర్మను ట్రోల్ చేశారు. వ్యూహంలో ఒక సీన్. తెల్లవారుజామున మూడు గంటలకు అవినాష్ రెడ్డికి కాల్.. బాబాయ్‌ను లేపేసిన తర్వాత అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు వర్మ గట్టిగా సమాధానం ఇచ్చారు. వావ్ ! మీ గొర్రెల బ్యాచ్ అనుకుంటున్నట్టు నేను వాళ్లకే ఫేవర్ చేస్తూంటే , ఈ కంటెంట్ ఎందుకు పెడతాను? ఇలాంటి ఐడియాలు పప్పెక్కువ తినేవాల్లకే వస్తాయి అని అన్నారు.

Ram Gopal Varma | Vyuham :









Updated : 3 Jun 2023 12:00 PM IST
Tags:    
Next Story
Share it
Top