రామ్ గోపాల్ వర్మ కొత్త ఆఫీస్.. లోపలన్నీ బూతు బొమ్మలే
X
కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయన మాట్లాడినా, ఏ పని చేసినా వార్తల్లోకి ఎక్కుతాడు. తాజాగా ఆర్జీవీ హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. దానికి ఆర్జీవీ డెన్ అని పేరు పెట్టాడు. దాంతో ఆయన మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు. రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఈ ఆఫీస్ లో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. ఫారెస్ట్ థీమ్ లో ఉన్న ఈ ఆఫీస్ మొత్తాన్ని.. కొండలు (బండలు), గుహలు, చెట్ల ఇంటీరియర్ తో నిర్మించాడు. దానికి తగ్గట్టే లైటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. ఆయన క్రియేటివిటీకి అవాక్కవుతున్నారు. అంతేకాదు.. ఈ ఆఫీస్ ద్వారా ఆర్జీవీ నాగార్జునపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆఫీస్ ఎంట్రన్స్‌లోనే కాదు.. లోపల కూడా నాగ్ తో ఉన్న భారీ సైజ్ ఫొటోలను ఏర్పాటు చేశాడు.
జంగిల్ థీమ్ తో పాటు.. ఆఫీస్ మొత్తం కొటేషన్స్, బూతు చిత్రాలతో నింపేశాడు. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్లోని బోల్డ్ ఫొటోలను గోడలకు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఆర్జీవీ మెయిన్ క్యాబిన్ మొత్తం జీఎస్టీ సినిమా ఫొటోలతో నింపేశాడు. వీటితో పాటు ఆయన తీసిన సినిమాల్లోని షూటింగ్ సన్నివేశాలు, అభిమాన నటి నటులతో దిగిన ఫొటోలను గోడలకు అంటించాడు. ఆ బిల్డింగ్ లోనే ఇంటర్వ్యూల కోసం స్టూడియో కూడా ఉంది. ఈ ఆఫీస్ మొత్తాన్ని ఆర్జీవీ సన్నిహితుడు వీడియో తీసి.. యూట్యూబ్ లో షేర్ చేశాడు.
ప్రస్తుతం వివాదాస్పద సినిమాలు తగ్గించిన ఆర్జీవీ.. యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. సామాజిక, రాజకీయ అంశాలపై ప్రముఖులతో డిబేట్లు పెడుతున్నాడు. అంతేకాకుండా వ్యూహం సినిమాతో బిజీగా ఉన్న వర్మ.. కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశాడు.