Home > సినిమా > పూనమ్ పాండేపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు

పూనమ్ పాండేపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు

పూనమ్ పాండేపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
X

సర్వైకల్ క్యాన్సర్‌ (Cervical cancer)పై అవగాహన కోసమే చనిపోయినట్లు నటించిన పూనమ్ పాండే పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ సమస్యపై దృష్టిని ఆకర్షించడానికి మీరు ఎంచుకున్న పద్దతిని కొందరు విమర్శించవచ్చు. కానీ ఎవరు దాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ అంతట ట్రెండింగ్‌లో ఉంది. మీరు ఎన్నో ఏళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా అని వర్మ ట్వీట్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా సినీ నటి పూనమ్ పాండే (Poonam Pandey) చనిపోయారనే వార్త సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే తాను చనిపోలేదని, సర్వైకల్ క్యాన్సర్ పై మహిళ్లలో అవగాహన కల్పించేందుకు తాను మృతి చెందినట్టు ప్రచారం చేశానని ఈరోజు ఆమె తెలిపిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటి, మెడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ పాండే గత కొద్ది రోజులుగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటుందట.

ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు ఓ పోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని పూనమ్ మేనేజర్ సోషల్ మీడియా (Social media) వేదికగా నిర్ధారించారు. దీంతో చాలా మంది ఆమెకు సంతాపం కూడా తెలియజేశారు. అయితే.. కొంత మంది మాత్రం ఆమె చనిపోలేదని ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే నిజం చేస్తూ.. అందరినీ షాక్‌కు గురిచేసింది. నేను బతికే ఉన్నాను అని ఓ వీడియో రిలీజ్ చేసింది పూనమ్. వీడీయోలో ఉన్న దాని ప్రకారం.. ‘మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను చనిపోలేదు. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే.. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. హెచ్‌పీవి వ్యాక్సిన్ (HPV vaccine) ముందస్తుగా గుర్తించే పరీక్షలలో కీలకమైనది. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయాని పూనమ్ పాండే తెలిపారు.

Updated : 3 Feb 2024 9:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top