మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ సెటైర్.. టార్గెట్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్
X
వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతుంటాడు. తాజాగా మెగా ఫ్యామిలీపై చేసిన ట్వీట్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. గత ఎన్నికల టైంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. ఈసారి ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలతో రాబోతున్నాడు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. వ్యూహం సినిమా నుంచి ఇప్పటికే పలు విజువల్స్, ఫొటోలు షేర్ చేసిన వర్మ.. తాజాగా మరో ఫొటోతో చర్చల్లో నిలిచాడు.
ఇందులో భాగంగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ని పోలిన రెండు క్యారెక్టర్ల ఫొటోను షేర్ చేసి 2+2=1 అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో నెటిజన్స్ దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీని అర్థం ఏంటంటే.. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి, ఒక చోట గెలుపొందారు. పవన్ కూడా జనసేన పార్టీ పెట్టి రెండు చోట్ల పోటి చేశాడు. ఆ రెండిట్లో ఓడిపోవడంతో ఇలా సెటైరికల్ ట్వీట్ చేశాడు వర్మ.
2 + 2 = 1 pic.twitter.com/3PKANneyeP
— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2023