Home > సినిమా > ఆర్జీవీ బంపర్ ఆఫర్.. అది కావాలంటూ ట్వీట్

ఆర్జీవీ బంపర్ ఆఫర్.. అది కావాలంటూ ట్వీట్

ఆర్జీవీ బంపర్ ఆఫర్.. అది కావాలంటూ ట్వీట్
X

ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తలల్లో నిలిచే సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు. టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన సినిమాలు తీసి, ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవీ.. ఈ మధ్య ఏవేవో సినిమాలు తీస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆయన ఫిలాసఫీ మాటలు చెప్తూ.. డైహార్డ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన.. ఆర్జీవీ డెన్ ను నిర్మించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో ఇకపై పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా.. ఔత్సాహిక దర్శకులు, మ్యూజిక్ కంపోజర్లు, రైటర్లు, కెమెరామెన్లు కావాలంటూ ఆర్జీవీ ప్రకటించాడు. ఆయన వినూత్నంగా ప్రకటించిన తీరు అందరిపీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ఏఆర్ రెహమాన్, ఇళయరాజా కంటే గొప్పగా మ్యూజిక్ కంపోజ్ చేస్తామనే నమ్మకం ఉంటేనే ముందుకు రండి. మా టైం వేస్ట్ చేయకండి’ అని ట్వీట్ చేశాడు. దీంతో కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్లకు గొప్ప అవకాశం దక్కింది. ఆర్జీవీ డెన్ లో ఆర్జీవీతో కలిసి పనిచేయాలంటే.. rgvden.comను సంప్రదించి.. వివరాలు తెలిపాలి.





Updated : 31 July 2023 5:52 PM IST
Tags:    
Next Story
Share it
Top