Home > సినిమా > చేతిలో మనవరాలు...కళ్ళల్లో వెలుగు

చేతిలో మనవరాలు...కళ్ళల్లో వెలుగు

చేతిలో మనవరాలు...కళ్ళల్లో వెలుగు
X

అన్ని పుట్టినరోజుల కంటే ఈసారి చాలా స్పెషల్ మెగాస్టార్ చిరంజీవికి. ఎందుకంటే ఈ బర్త్ డేకు కొత్త మనవరాలు వచ్చింది. తాతకు స్వయంగా విషెస్ చెప్పింది. ఆయన కళ్ళల్లో వెలుగును నింపింది. చిరంజీవి 68వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో చిరు మనవరాలు, రాంచరణ్ కూతురు క్లీంకార బర్త్ డే విషెస్ మాత్రం అన్నిటికంటే ప్రత్యేకం.

మహేష్ బాబు, జూ.ఎన్టీయార్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్.. ఇంకా డైరెక్టర్లు ఇలా అందరూ మెగాస్టార్ ను పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచేస్తున్నారు. వీళ్ళందరితో పాటూ నాన్నకు బర్త్ డే విషెస్ చెబుతూ తనయుడు రాం చరణ్ కూడా ఓ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో మనవరాలిని ఎత్తుకుని మురిసిపోతున్న చిరంజీవి ఉన్నారు. హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ చిరుత(చిరు తాత) అంటూ క్యాప్షన్ రాశాడు. అంతే కాదు మా కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి బోలెడంత లవ్ అంటూ అని కూడా మెన్షన్ చేశాడు రాం చరణ్.

ఇన్స్టాలో పెట్టిన ఫోటోలో క్లీంకార మొహాన్ని చూపించకుండా లవ్ గుర్తుతో కవర్ చేశారు రాం చరణ్. అయినా కూడా ఆ పిక్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. అన్నింటికంటే చిరు మొహంలో ఆనందం చూసి అభిమానులు పొంగిపోతున్నారు. లైకులు మీద లైకులు కొట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు మెగాస్టార్ తరువాతి సినిమాల గురించి అనౌన్స్ మెంట్లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చేస్తున్నాయి. మెగా 156, 157 సినిమా గురించి అఫీషియల్ ప్రకటనలు విడుదల చేశారు.


Updated : 22 Aug 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top