10వేల ‘ఆదిపురుష్’ సినిమా టికెట్లు కొన్న రాంచరణ్..?
X
రామాయణం ఇతివృత్తంతో వస్తున్న చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో రాముడిగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాష్ కనిపిస్తున్నాడు. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఆదిపురుష్ కోసం ప్రభాష్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా హీరో రాంచరణ్ 10వేల ‘ఆదిపురుష్’ సినిమా టికెట్లు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆనాథులకు సినిమా చూపించేందుకు భారీగా టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా క్లారిటీ రావాల్సింది. రాంచరణే కాకుండా ఇప్పటికే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో పాటు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తమవంతుగా ఒక్కొక్కరు 10వేల చొప్పున సినిమా టికెట్లు కొనుగోలు చేసి నిరుపేదలు, అనాథలకు ఆదిపురుష్ సినిమా చూపించనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల్లొ నిజమెంతో తెలియాలంటే ఆదిపురుష్ సినిమా విడులయ్యే వరకు ఆగాల్సిందే.
రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6200కి పైగా స్క్రీన్లలో విడుదల చేయనుండగా.. తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు లక్ష్యం మేకర్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.ఏకంగా రూ.170 కోట్లు పెట్టి పీపుల్స్ మీడియా సంస్థనే దక్కించుకున్నట్లు తెలుస్తోంది.