మరో సారి గ్లోబల్ గా రామ్ చరణ్ పేరు మారుమోగనుందా?
X
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ ఒక పెద్ద సక్సెస్. మిగిలిన అందరూ తెలుగు సినిమాల్లో, నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటే రామ్ చరణ్ మాత్రం అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చెర్రీ క్రేజ్ ప్రపంచం అంతా పాకింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అతని యాక్షన్ కు పెద్ద పెద్ద వాళ్ళే ఫిదా అయిపోయారు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి వాళ్ళు కూడా చరణ్ గురించి మాట్లాడారు అంటే అర్ధం చేసుకోవచ్చు అతను ఎంత పాపులర్ అయిపోయాడో. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ పేరు మారుసారి సినీ వర్గాల్లో మారుమోగుతోంది.
ఫేమస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్ తుది జాబితాలో రామ్ చరణ్ పేరు ఉండడమే దీనికి కారణం. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పడుకోన్ లాంటి వారితో పాటూ మన చెర్రీ పేరు కూడా ఉంది. ఇండియా నుంచి అవార్డులను నామినేట్ అయిన వారిలో చరణ్ ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గ్లోబల్ క్రేజ్ ఉంది కాబట్టి...ఆల్రెడీ మనవాళ్ళు ఆ సినిమాతో ఓ లెవల్ కు వెళ్ళిపోయారు కావున ఇప్పుడు ఈ అవార్డ్ కూడా చెర్రీకే వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. షారూఖ్ లాంటి వారు ఉన్న కూడా ఈ అవార్డ్ కు రామ్ చరణ్ అర్హుడని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ అవార్డుల ఫంక్షన్ యూఎస్ లో జరగనుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమాలు ఇప్పటి వరకూ ఏమీ రాలేదు. అయితే ప్రస్తుతం అతను ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే మూవీలో నటిస్తున్నారు. దీంతో పాటూ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమాలో చేయనున్నారు చెర్రీ. వీటి కోసం ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.