Home > సినిమా > నా కన్నా పెద్ద కమెడియన్ నువ్వే.. నాగబాబుకు ఆర్జీవీ కౌంటర్

నా కన్నా పెద్ద కమెడియన్ నువ్వే.. నాగబాబుకు ఆర్జీవీ కౌంటర్

నా కన్నా పెద్ద కమెడియన్ నువ్వే.. నాగబాబుకు ఆర్జీవీ కౌంటర్
X

రామ్ గోపాల్ వర్మ - నాగబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ వేసే సెటైర్స్కు నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు. ఈ మధ్య ఇద్దరూ సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఒకరిపై ఒకరు కౌంటర్లు, సెటైర్లతో రంగంలోకి దిగారు. దీనికి వ్యూహం సినిమా వేదికైంది. ఆర్జీవీ తల నరికితే కోటి రూపాలు ఇస్తానంటూ ఓ వ్యక్తి ప్రకటించగా.. దానిపై వర్మ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై నాగబాబు స్పందించగా.. దానికి వర్మ కౌంటర్ ఇచ్చారు.

ఆర్జీవీ అంశంపై నాగబాబు సెటైరికల్గా స్పందించాడు. ఆర్జీవీ ఓ కమెడియన్ అని.. ఆయన్ని ఎవరూ చంపరంటూ కామెంట్ చేశారు. ‘‘ఆర్జీవీపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారు మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని హామీ ఇస్తున్నాను. ఇండియాలో ఏ పనికిమాలిన వెదవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ని ఎవడు చంపడు కదా. మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి’’ అంటూ నాగబాబు రాసుకొచ్చాడు.

నాగబాబు పోస్ట్పై ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తనకన్నా పెద్ద కమెడియన్ నాగబాబు అంటూ సెటైర్ వేశారు. ‘‘సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవరంటే.. నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి’’ అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. దీన్ని నిలపేయాలంటూ లోకేష్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Updated : 28 Dec 2023 9:30 AM IST
Tags:    
Next Story
Share it
Top