ఆర్జీవీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పూరీ
X
శివ సినిమా.. ఆర్జీవీ సహా ఎంతోమంది యాక్టర్స్, డైరెక్టర్స్కు లైఫ్ ఇచ్చిన సినిమా.1989లో వచ్చిన ఈ మూవీలో తెలుగులో ట్రెండ్ క్రియేట్ చేసింది. నాగార్జున కేరీర్ శివకు ముందు శివ తర్వాత అనేలా మార్చింది. కథ, కథనం, నటన, సాంకేతిక విలువలు, సంగీతం... ఇలా ఎలా చూసినా శివ టాలీవుడ్ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాపై డైరెక్టర్ ఆర్జీవీ ఎప్పటికప్పుడు తన అనుభవాలను షేర్ చేసుకుంటారు. తాజా ఆయన చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
నాగార్జున ఆవేశంగా నడిచి వస్తుండగా, వెనుక ఓ కుర్రాడు ఆయన్ని ఫాలో అవుతుంటాడు. ఆ కుర్రాడు ఎవరో ఆర్జీవీ తాజాగా రివీల్ చేశారు. అతడు టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని ట్వీట్ చేశారు. ‘‘ఆ రోజు సెట్స్లో ఉన్న పూరీ జగన్నాథ్ను బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఉపయోగించాం. ఆ తర్వాత అతడు అద్భుతమైన రీతిలో ఎదిగాడు’’ అని వర్మ కొనియాడారు.
కాగా బద్రీ సినిమాతో పూరీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇడియట్, దేశముదురు, పోకిరి వంటి సినిమాలతో టాలీవుడ్ను షేక్ చేశారు. లైగర్ సినిమాతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తోన్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. బుధవారం నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. డబుల్ ఇస్మార్ట్ 2024 మార్చి 8న రిలీజ్ కానుంది.
A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1
— Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023