నరేష్ మళ్లీ పెళ్లికి అమెజాన్ షాక్
X
నరేష్, పవిత్ర లోకేష్ల మళ్లీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్ను అమెజాన్ ఆపేసింది. ఇవాళ్టి నుంచి ఈ మూవీ అమెజాన్, ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సివుంది. అయితే నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతి లీగల్ నోటీసులు పంపించడంతో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడిపోయి, ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్తో రిలేషన్లో ఉన్నారు.
నరేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మళ్లీ పెళ్లి పేరుతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో తనను విలన్గా చూపించారని రమ్య రఘుపతి కోర్టుకెక్కారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవడంతో ఆమె అమెజాన్ తో పాటు ఆహా సంస్థలకు లీగల్ నోటీసులు పంపింది. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ స్ట్రీమింగ్ ను ఆపేసింది. అయితు ఆహాలో మాత్రం స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు అమెజాన్ లో మిస్ అయిన ఈ మూవీని ఆహాలో చూడొచ్చన్నమాట.
సీనియర్ డైరెక్టర్ ఎం.ఎస్. రాజు డైరెక్షన్ వహించిన మళ్లీ పెళ్లి సినిమా మే 26న థియేటర్లలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా చేసి నరేష్ పవిత్రలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో వారి బంధం, పెళ్లి గురించి అనేక సంచలన వ్యాఖ్యలు చేసి ట్రోల్ కూడా అయ్యారు.