హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్ అదిరిపోయింది
X
హిరణ్యకశ్యప... రానా మెయిన్ క్యారెక్టర్ లో రాబోతున్న మూవీ. శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ సినిమా గురించి అనౌన్స్ చేశాడు రానా. తరువాత బోలెడంత రచ్చ కూడా జరిగింది. ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో కాన్సెప్ట్ టీజర్ ను కూడా రిలీజక చేశారు. కామిక్ బొమ్మలతో వచ్చిన ఈ టీజర్ చాలా ఇంట్రస్ట్రింగ్ గా ఉంది.
ప్రముఖ కామిక్ కథలు 'అమర్ చిత్ర కథ' నుంచి తీసుకుని సినిమాను తీస్తున్నామని చెప్పారు రానా. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. సోషల్ మీడియాలో హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. కామిక్స్ రూపంలో ఉన్న ప్రహ్లాద పాత్రను చూపిస్తూ ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత హిరణ్యకశ్యపతో పాటు మరో రెండు మూడు పాత్రలూ అన్నీ డ్రాయింగ్స్ రూపంలో చూపించారు. ఆ కాలంలో జరిగిన సంఘటనలను కామిక్ రూపంలో వివరించేందుకు ప్రయత్నించారు. చివరిగా ఫస్ట్ లుక్ పోస్టర్ తరహాలో ఉన్న కామిక్ హిరణ్యకశపను చూపించి ముగించారు. దీనికి మంచి మ్యూజిక్ ని కూడా జోడించారు. మొత్తానికి కాన్సెప్ట్ టీజర్ మూవీ ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
వాస్తవానికి హిరణ్యశ్యప సినిమా గురించి ముందు గుణశఏకర్ అనౌన్స్ చేశారు. రానాకే కథ కూడా చెప్పారు. అయితే ఆయన తీసిన శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అవడంతో గుణశేఖర్ ను పక్కకు పెట్టారు. ఆ విషయం ఆయనకు కూడా చెప్పలేదు. సడెన్ గా కామిక్ కాన్ వేదిక మీద ప్రకటించడంతో రచ్చ అయింది. వెంటనే గుణశేఖర్ అధర్యంగా ప్రవర్తించేవాళ్ళకు ఎప్పుడూ మంచి జరగదు అన్న టైప్ లో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తాను చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఈ సినిమాను గుణశేఖర్ కే ఇస్తారా లేదా ఇంకెవరైనా తీస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.