Home > సినిమా > Animal teaser: సందీప్ వంగ మార్క్.. రణ్బీర్ గ్రేస్.. ‘యానిమల్’ టీజర్లో ఏముంది?

Animal teaser: సందీప్ వంగ మార్క్.. రణ్బీర్ గ్రేస్.. ‘యానిమల్’ టీజర్లో ఏముంది?

Animal teaser: సందీప్ వంగ మార్క్.. రణ్బీర్ గ్రేస్.. ‘యానిమల్’ టీజర్లో ఏముంది?
X

డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ పేరు చెప్తే గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. మొదటి సినిమాతో యమ క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్. బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రష్మిక చేస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌంన్స్ చేసినప్పటి నుంచి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకులు.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా రణ్ బీర్ కపూర్ పుట్టినరోజు సంద్భంగా ఈ సినిమా ఫుల్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. దాంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. టీజర్ లో స్టోరీ కాస్త లీక్ అయి లీక్ అవనట్లు అనిపించింది.

టీజర్లో ఏం ఉంది?

టీజర్ కాస్త సస్పెన్స్ గానే అనిపించింది. టైటిల్, టీజర్ బట్టి చూస్తుంటే.. హీరో మృగంలాంటి స్వభావం కలిగిన వ్యక్తిలా అనిపిస్తుంది. అంతేకాదు.. అతను అలా మారడానికి కారణం కూడా తన తండ్రి అనే డైలాగ్స్ వినిపిస్తుంటాయి. టీజర్ చివరి వరకు చూస్తే.. డబ్బున్న కుటుంబంలో పుట్టిన హీరో జల్సాలకు అలవాటు పడి, తప్పులు చేస్తుంటాడు. దాంతో హీరోను మందలిస్తూ అతని తండ్రి ఎప్పుడూ కొడుతుంటాడు. కట్ చేస్తే.. యానిమల్ లా మారిన హీరో, ఓ గ్యాంగ్.. ఫైట్లు.. యాక్షన్ సీన్లు.. కత్తులు, బాంబులు, గన్స్.. ఇలా టీజర్ అంతా ఫుల్ యాక్షల్ లో ఉంది. అయితే హీరో అదంతా తన తండ్రి కోసం చేస్తున్నట్లు తెలుస్తుంది. తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా.. హీరో యానిమల్ లా మారినట్లు అర్థం అవుతుంది. రివేంజ్ యాక్షన్ డ్రామాతో సాగుతుంటే.. చివర్లో ‘ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు నాన్నా’ అనే డైలాగ్ తో సినిమా స్టోరీ తెలిసిపోతుంది. కాగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు.





Updated : 28 Sept 2023 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top