రణబీర్ కపూర్ యానిమల్ రిలీజ్ వాయిదా.. కారణమేంటో..?
X
బాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ మూవీస్‌లో రణబీర్ కపూర్ యానిమల్ ఒకటి. టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మాఫీయా బ్యాక్ గ్రౌండ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. రష్మిక మందన్న హీరోయిన్. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రీ టీజర్ ఆడియన్స్ లో సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావడం లేదని వార్తలు వినిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సూపర్బ్ బజ్ క్రియేట్ అయింది. యానిమల్ మూవీని ఇండిపెండెన్స్ వీకెండ్ సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు, అయితే ఇప్పుడు అది వాయిదా పడి ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని సమాచారం. ఇదిలా ఉంటే ఆగష్టులో చిరు అండ్ రజిని మధ్యనే పోటీ ఉండబోతుంది. చిరంజీవి – భోళా శంకర్ 11న, రజినీకాంత్ – జైలర్ 10న రిలీజ్ కాబోతున్నాయి.