Home > సినిమా > నేను బరువు పెరిగిందీ అందుకే...తగ్గిందీ అందుకే- రాశీఖన్నా

నేను బరువు పెరిగిందీ అందుకే...తగ్గిందీ అందుకే- రాశీఖన్నా

నేను బరువు పెరిగిందీ అందుకే...తగ్గిందీ అందుకే- రాశీఖన్నా
X

ఊహలు గుసగుసలాడేతో తెలుగు సినిమాలకు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీఖన్నా. మొదట్లో బొద్దుగా, ముద్దుగా ఉండే ఈ అమ్మాయి తర్వాత చాలా సన్నగా అయిపోయింది. అడపాదడపా సినిమాలు చేస్తూ, వెబ్ సిసీల్లో నటిస్తున్న రాశీ తాజాగా తన లవ్ మ్యాటర్ రివీల్ చేసింది. తాు లవ్ లో ఉన్నాని చెప్పేసింది.

అంతేకాదు తన లవ్ వెనుక బోలెడంత స్టోరీ ఉందని కూడా చెప్పింది రాశీఖన్నా. మొదట్లో ఒక బ్రాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉండేదిట ఈ హీరోయిన్. తర్వాత ఏవో కారణాల వలన అతడితో బ్రేకప్ అయింది. దాంతో ఈ అమ్మడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దానికి తోడు థైరాయిడ్ సమస్య. దాంతో రాశీ బాగా బరువు పెరిగిపోయిందట. ఆ ఎఫెక్ట్ సినిమాల మీద కూడా పడిందని చెబుతోంది. దాంట్లోంచి బయటకు ఎలా రావాలో అస్సలు తెలియలేదుట. జిమ్ కోచ్ ని కూడా మార్చేసింది. కానీ ఫలితం కనిపించలేదు. మళ్ళీ కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాకనే బరువు తగ్గిందట. అది కూడా రాశీఖన్నానే చెబుతోంది. ఫైనల్ గా నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి దొరకాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాతనే బరువు తగ్గాను. నేను అనుకున్నట్లు మారాను. ఇదంతా అతడితో ఉండడం వల్లనే జరిగిందని చెబుతోంది.

అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. మొదటి బాయ్ ఫ్రెండ్ గురించీ చెప్పలేదు, రెండవ అతని గురించి కూడా చెప్పలేదు. కానీ తను లవ్ లో ఉన్నట్టు మాత్రం కన్ఫార్మ్ చేసింది. రాశీఖన్నా చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏమీ లేవు. లాస్ట్ ఇయర్ విడుదల అయిన థాంక్యూ, పక్కా కమర్షియల్ రెండూ ఫ్లాప్స్ అయ్యాయి. తర్వాత చేసిన ఫర్జీ వెబ్ సీరీస్ మాత్రం హిట్ అయింది.


Updated : 1 Aug 2023 7:56 PM IST
Tags:    
Next Story
Share it
Top