Home > సినిమా > Rashmika : రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్

Rashmika : రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్

Rashmika : రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్
X

రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. ఆమె డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన వ్యక్తి ఆ వీడియో రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రష్మిక వీడియోను షేర్ చేసిన వారందరినీ ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు చివరకు నిందితున్ని పట్టుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతన్ని ఢిల్లీకి తరలించినట్లు సమాచారం.

గతేడాది నవంబర్లో రష్మిక డీప్ పేక్ వీడియో వైరల్గా మారింది. భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఇన్ఫ్లూయెన్సర్ జారా పటేల్ లిఫ్ట్లోకి ఎంటరవుతున్న వీడియోను నిందితుడు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేశాడు. దీనిపై రష్మిక సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డీప్ ఫేక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. సోషల్ మీడియా కంపెనీలకు అడ్వైజరీ జారీ చేసింది. డీప్ ఫేక్ వీడియోలను తొలగించాలని, అవి సర్కులేట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

2017లో డీప్ ఫేక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఉపయోగించి ఆడియో, వీడియోలను మార్ఫ్ చేసే అవకాశముంది. అప్పటి నుంచి ఆ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వ్యక్తులు, సంస్థలు, చివరకు ప్రభుత్వాలను సైతం ఇబ్బందిపెడుతున్నారు.

Updated : 20 Jan 2024 10:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top