ఆ సినిమా అందరికీ నచ్చుతుంది.. సీన్స్ మనసులో నిలిచిపోతాయి: రష్మిక
X
కొన్ని సినిమాలకు చాలామంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. సినిమా చూస్తూనే ఏడుస్తుంటారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందనా కూడా అలానే ఎమోషనల్ అయింది. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రష్మికను కంటతడి పెట్టించిన ఆ సినిమా ఏదంటే..
యంగ్ హీరో, హీరోయిన్స్ ఆనంద్ దేవర కొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించి సినిమా ఓ ‘బేబీ’. ఈ సినిమా చూసి ఎమోషనల్ అయినట్లు రష్మిక ట్వీట్ చేసింది. ‘నేను బేబీ మూవీ చూశా. ఈ సినిమాలోని ఒక్కో సీన్ చాలా కాలంపాటు నా హార్ట్ నిలిచిపోతాయి. ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. మూవీ టీంకు కంగ్రాట్స్’ అని తెలిపింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ రూ.7.1కోట్ల వసూళ్లు చేసింది. ప్రస్తుతం హిట్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాకు జనాలు ఎగబడి వెళ్తున్నారు.