Home > సినిమా > Prabhas : ప్రభాస్కు జోడిగా రష్మిక మందన్న? స్పిరిట్ క్రేజీ అప్డేట్

Prabhas : ప్రభాస్కు జోడిగా రష్మిక మందన్న? స్పిరిట్ క్రేజీ అప్డేట్

Prabhas  : ప్రభాస్కు జోడిగా రష్మిక మందన్న? స్పిరిట్ క్రేజీ అప్డేట్
X

ఇటీవల సలార్ మూవీతో భారీ హిట్ కొట్టాడు డార్లింగ్ ప్రభాస్(prabhas). పాన్ ఇండియా(pan India) మూవీగా తెరకెక్కిన సలార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మూవీ హిట్ తర్వాత వరుస సినిమాలను పట్టాలెక్కించాడు మన బాహుబలి. తాజాగా రాజాసాబ్, స్పిరిట్ సినిమాల్లో నటించనున్నాడు. ఇటీవల రాజాసాబ్ నుంచి వచ్చిన డార్లింగ్ ఫస్ట్ లుక్ కి ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే యానిమల్(animal) సినిమాతో మరోసారి పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిన క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పిరిట్ మూవీని తీస్తున్నారు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్ పోలీస్ అవతారంలో ప్రభాస్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

అయితే తాజాగా స్పిరిట్(spirit) మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా రష్మికను తీసుకోబోతున్నారన్న టాక్ ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇటీవలే యానిమల్ లో రణీబీర్ కు జోడిగా నటించిన రష్మిక(rashmika)నే స్పిరిట్ లో కూడా ఒక హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నాడట సందీప్. అటు రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా ప్రభాస్ సరసన ఉంటుందని సమాచారం.

వరుస పాన్ ఇండియా మూవీలతో నేషనల్ క్రష్ రష్మిక దూసుకెళ్లిపోతుంది. త్వరలో అల్లు అర్జున్ సరసన పుష్ప 2తో పలకరించనుంది. ప్రభాస్ కు జోడిగా రష్మిక చేస్తుందని టాక్ రావడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక రెండు భారీ హిట్లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ప్రభాస్ హీరో కావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. సందీప్ తీసిన రెండు మూవీల్లో హీరోలు అగ్రెసివ్, బోల్డ్ గా నటించారు. మరి స్పిరిట్ లో డార్లింగ్ ఎలాంటి రోల్ లో యాక్ట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.










Updated : 13 Feb 2024 10:43 AM IST
Tags:    
Next Story
Share it
Top