Animal Movie : గీతాంజలిగా రష్మిక..యానిమల్ ఫస్ట్ లుక్ వైరల్
X
ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ యానిమల్ . సినీ లవర్స్‌లో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు బార్డర్‌లు పెట్టుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీకే అర్జున్ రెడ్డి లాంటి సినిమాను అందించి, యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అసలు బార్డర్‌లు లేని బాలీవుడ్ ఇండస్ట్రీలో యానిమల్‌తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అంతా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై జనాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ బాలీవుడ్, టాలీవుడ్లో ఎలాంటి అలజడిని సృష్టించింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక టీజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అంతా విజువలైజ్ చేసుకుటున్నారు. ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి తన ట్విటర్లో యానిమల్ సినిమా హీరోయిన్ రష్మిక పోస్టర్ విడుదల చేశాడు. గీతాంజలిగా రష్మిక అంటూ అందరికీ పరిచయం చేశాడు.
తాజాగా సందీప్ వంగ సోషల్ మీడియా వేదికగా యానిమల్ సినిమా నుంచి రష్మిక లుక్‌ను విడుదల చేశారు. చీరకట్టుకుని నుదుటన బొట్టుతో కూల్‌గా కనిపిస్తున్న రష్మిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో శాండిల్ వుడ్ బ్యూటీ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో ఇన్‌బాక్స్‌ను ముంచేశారు. నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన రష్మిక పుష్ప సినిమాతో బాలీవుడ్‌ను ఆకర్షించింది . ఇప్పటికే ఈ చిన్నది హిందీలో పలు సినిమాల్లో నటించింది .కానీ, ఏ సినిమా కూడా సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది. కానీ సందీప్ రెండ్డి వంగ చేతిలో పడటంతో.. యానిమల్ సినిమాతో అమ్మడికి బాలీవుడ్లో స్టార్డమ్ పక్కా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యానిమల్ సినిమా టీజర్ ఈ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీంతో సినీ లవర్స్ ఈ సినిమా టీజర్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వస్తున్న సినిమా యానిమల్. ఈ మూవీలో స్టార్ హీరో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే మూవీ నుంచి రణ్‌బీర్ పిక్స్ కొన్ని నెట్టింట్లో లీక్ అయ్యాయి. క్లీన్ షేవ్‌లో ఉన్న రణ్‌బీర్ లుక్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.