అందానికి అమ్మ చిట్కా.. తన బ్యూటీ సీక్రెట్ చెప్పిన నేషనల్ క్రష్
X
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కిరిక్ సినిమాతో మొదలైన రష్మిత సినిమా ప్రయాణం.. పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తన అందంతో అందరి మనసు దోచుకున్న ఈ అమ్మడు బ్యూటీ సీక్రెట్ తెలుసుకోవడానకి అభిమానులు తెగ ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు రష్మికను బ్యూటీ సీక్రెట్ చెప్పమని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా తన అందానికి గల రహస్యాన్ని రష్మిక అభిమానులతో పంచుకుంది.
ఇటీవల ఓ ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడిన రష్మిక ఆ సీక్రెట్ ను బయటపెట్టింది. టైమ్ దొరికినప్పుడు తన అందంపై దృష్టిపెడతానని, పోషకాలతో కల్గిన ఆకుకూరలు తింటానని చెప్పింది. అంతేకాకుండా నిద్రపోయే ముందు తన ముఖాన్ని రెండు సార్లు క్లీన్ చేసుకుంటానని చెప్పింది. ‘గోరువెచ్చని కొబ్బరినూనెను ముఖానికి, తలకు పట్టిస్తా. ఎప్పుడూ హైడ్రేటెడ్ ఉండటానికి ప్రయత్నిస్తా. వీటితో మా అమ్మ చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతుంటా. అదే నా బ్యూటీ సీక్రెట్’ అని వివరించింది.