Home > సినిమా > Rashmika : భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్న రష్మిక మందన్నా

Rashmika : భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్న రష్మిక మందన్నా

Rashmika : భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్న రష్మిక మందన్నా
X

హిట్స్ వస్తే ఇమేజ్ పెరుగుతుంది. రేంజ్ మారుతుంది. వీటితో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్స్ కూడా పెరుగుతాయి. అవి అప్పటి వరకూ చూసిన, విన్న వాటికి భిన్నంగా ఉంటాయి. దీంతో ఆ హీరో లేదా హీరోయిన్ పై రకరకాల వార్తలు వస్తాయి. ప్రస్తుతం రష్మిక మందన్నా విషయంలోనూ ఇదే జరుగుతోంది. అసలే నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ యానిమల్ బ్యూటీ ఇప్పుడు నిర్మాతల పాకెట్స్ ను కూడా క్రష్ చేస్తోందంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. అది కూడా తను ఇప్పటి వరకూ తెలుగులో ఏ హీరోయిన్ తీసుకోనంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. మరి అంత డిమాండింగ్ ఎందుకు చేస్తోంది..? ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..?

రష్మిక మందన్నా.. ఛలో మంటూ తెలుగు తెరకు పరిచయమైన కన్నడ సోయగం. గీత గోవిందంతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. మొదట్లో తను నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో అమ్మడిని అంతా గోల్డెన్ లెగ్ అన్నారు. ఆ లెగ్ ను నమ్ముకున్న కొన్ని సినిమాలు పోయాయి. అయినా తన ఇమేజ్ తగ్గలేదు. మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కాస్త ఇబ్బందిగా ఉన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ తనే అంటే తప్పేం లేదేమో. ఇక ఇక్కడ క్రేజీ ఆఫర్స్ ఉన్న టైమ్ లోనే ఈ శ్రీవల్లికి బాలీవుడ్ కు వెళ్లి జెండా ఎగరేయాలని కోరిక కలిగింది. అంతే.. వెంటనే ముంబైలో ల్యాండ్ అయింది. వరుసగా ఆఫర్స్ అందుకుంది.కాకపోతే అవేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఇక సౌత్ కే పరిమితం అనుకుంటోన్న టైమ్ లో వచ్చిన యానిమల్ అన్ని బాక్సాఫీస్ లనూ షేక్ చేసింది. బాలీవుడ్ లో అయితే ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ కమర్షియల్ గా కూడా ఏ మాత్రం తగ్గలేదు. రష్మిక పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నా రెండు మూడు సీన్స్ లో తనదైన ముద్రను చూపించింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప2 తో పాటు రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్ అనే విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఓ రకంగా తన పనేదో తను చేసుకుంటోన్న టైమ్ లో సడెన్ గా రష్మిక రెమ్యూనరేషన్ భారీగా పెంచింది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అది కూడా తను 4 కోట్లు డిమాండ్ చేస్తోంది. అదనపు ఖర్చులు వేరే అంటోంది అంటూ న్యూస్ వినిపిస్తున్నాయి. దీంతో రష్మికకు అంత సీనుందా..? ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఈవిడ గొప్ప ఏంటంట..? యానిమల్ లో పాత్రేం బాలేదు కదా..? అయినా నేషనల్ క్రష్ అంటే.. తనేమో నిర్మాతల బ్యాంక్ బ్యాలన్స్ లను క్రష్ చేస్తోందా అంటూ ఎవరికి తోచినట్టు వాళ్లు కమెంట్స్ చేస్తున్నారు. బట్ ఇవేం నిజం కాదూ అంటూ రష్మిక మందన్నా కాస్త ఎటకారంగానే రియాక్ట్ అయింది. ‘ఈ వార్తలు చూసి ఆశ్చర్యపోయాను నేను. ఇక నుంచి నిర్మాతలను అంతే డబ్బులు అడుగుతాను. ఎందుకు అని వాళ్లు అడిగితే.. మీడియాలో ఇలాగే వస్తోంది.. వాళ్లు చెప్పినట్టే జరగాలి కదా అంటాను..’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొత్తంగా అమ్మడి మనసులో.. ‘అంటే అన్నారు కానీ.. ఆ రెమ్యూనరేషన్ ఎంత బాగుందో’ అనుకుని ఉంటుంది.. కానీ నిజం కాదు కదా అందుకే ఇలా సెటైరేసింది. సో.. ఈ నేషనల్ క్రష్ నిర్మాతలను క్రష్ చేస్తోంది అనేది ప్రస్తుతానికైతే రూమరే అన్నమాట.

Updated : 6 Feb 2024 11:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top