Home > సినిమా > మేనేజర్తో విభేదాలు.. స్పందించిన రష్మిక

మేనేజర్తో విభేదాలు.. స్పందించిన రష్మిక

మేనేజర్తో విభేదాలు.. స్పందించిన రష్మిక
X

తన పర్సనల్ మేనేజర్ మోసం చేశాడంటూ వస్తున్న వార్తలపై నటి రష్మిక మందన స్పందించింది. తమ మధ్య వ్యక్తి గత కలహాలు జరిగాయంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మేనేజర్ కు నాకు వ్యక్తి గతంగా ఎటువంటి శత్రుత్వం లేదు. కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు ఎదగాలని కోరుకున్నాం. దానివల్ల పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం. మేం చాలా ప్రొఫెషనల్స్. ఎక్కడైనా వర్క్ హాలిక్ గా ఉంటాం’ అని రష్మిక చెప్పొకొచ్చింది.

రష్మికను మేనేజర్ రూ.80 లక్షలు కాజేసి మోసం చేశాడని, అతడిని రష్మిక జాబ్ నుంచి తీసేసిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తన మెనేజర్ గా ఉన్న ఆ వ్యక్తి మోసం చేయడంతో రష్మిక బాధ పడుతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం అతన్ని జాబ్ నుంచి తొలగించాక.. రష్మిక ప్రశాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.




Updated : 22 Jun 2023 10:43 PM IST
Tags:    
Next Story
Share it
Top