Home > సినిమా > Rashmika Mandanna : అప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి: రష్మిక

Rashmika Mandanna : అప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి: రష్మిక

Rashmika Mandanna  : అప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి: రష్మిక
X

సందీప్ రెడ్డి వంగ, రణ్బీర్ కపూర్ కాంబీనేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న యానిమల్.. రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తుంది. ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ జానర్ లో రిలీజైన ఈ సినిమా.. హౌస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. సినిమాలోని ప్రతీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ రష్మిక మందన ఆసక్తికర పోస్ట్ పెట్టింది. యానిమల్ లో గీతాంజలి పాత్ర పోషించిన రష్మిక.. తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక.. యానిమల్ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

యానిమల్ లో తాను పోషించిన గీతాంజలి పాత్ర తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చింది రష్మిక. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉందని చెప్పింది. సినిమా రిలీజైనప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయని, ఒక నటిగా తనకు గీతాంజలి పాత్ర ఎంతో నచ్చిందని తెలిపింది. గీతాంజలి పాత్రలో నటించిన ప్రతి సీన్ ను ఎంజాయ్ చేసినట్లు వివరించింది. చిత్రీకరణ టైంలో సినిమా టీంతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు.




Updated : 9 Dec 2023 8:03 AM IST
Tags:    
Next Story
Share it
Top