Home > సినిమా > Bigg Boss Season 7 : హౌస్మేట్స్ దృష్టిలో ఫెయిల్.. ఆడియెన్స్ మాత్రం ఆకాశానికి ఎత్తేశారుగా..

Bigg Boss Season 7 : హౌస్మేట్స్ దృష్టిలో ఫెయిల్.. ఆడియెన్స్ మాత్రం ఆకాశానికి ఎత్తేశారుగా..

Bigg Boss Season 7 : హౌస్మేట్స్ దృష్టిలో ఫెయిల్.. ఆడియెన్స్ మాత్రం ఆకాశానికి ఎత్తేశారుగా..
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫస్ట్ వీకెండ్ షోలో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ఆట తీరు గురించి చెప్పారు. వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. తొలుత కంటెస్టెంట్స్ వారికి వారు ఎన్ని మార్క్స్ వేసుకుంటారో చెప్పాలన్న నాగ్.. ఆ తర్వాత ఆడియన్స్ ఇచ్చిన మార్కులు చదివి వినిపించారు. ప్రియాంక జైన్ తనకు తాను వంద మార్కులు వేసుకోగా ఆడియన్స్ మాత్రం 71 ఇచ్చారు. శివాజీ 90 మార్కులు వేసుకుంటే ప్రేక్షకులు మాత్రం 74 మార్కులు ఇచ్చారు. దామిని 95 మార్కులు వేసుకోగా.. ఆడియన్స్ 62 మాత్రమే ఇచ్చారు. ప్రిన్స్ యావర్ 94 మార్క్స్ ఇచ్చుకోగా 69 మాత్రమే వచ్చాయి.

ఇక షకీలా తనకి తాను 85 మార్కులు ఇచ్చుకుంది. కానీ ఆడియన్స్ మాత్రం 69 మార్కులు ఇచ్చారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి షకీలా పెర్ఫామెన్స్ చూడకముందు ఈ మార్కులు సేకరించడంతో.. వచ్చిన మార్కులకు అదనంగా నాగార్జున కొన్ని మార్కుల్ని కలిపాడు. ఆట సందీప్.. తనకి తాను 90 మార్కులేసుకోగా ఆడియన్స్ మాత్రం 72 మార్కులేశారు. ఆ తర్వాత కన్నీటి వరద పారిస్తున్న శోభాశెట్టి ఏడుపుపై నాగార్జున క్లాస్ పీకారు. ఏడుపుగొట్టు కంటెస్టెంట్స్ ను ఆడియన్స్ ఎప్పుడూ టాప్ 5కు పంపరని అది గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు. శోభాశెట్టి తనకి తాను.. 93 మార్కులేసుకుంటే ఆమెకి ఆడియన్స్ నుంచి 76 మార్కులే పడ్డాయి.

టేస్టీ తేజ వందకి వంద మార్కులు ఇచ్చుకోగా ఆడియన్స్ 77 మార్కులు వేసినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక ఫస్ట్ వీకెంట్ టాప్ ర్యాంకర్ గా రతిక నిలిచిందని నాగార్జున చెప్పాడు. ఉడత ఉడత ఊచ్ టాస్క్ దాదాపు రెండున్నర గంటల పాటు సాగిందని, ఉడత అనే పదం ఎన్నిసార్లు వ్చిచందని బిగ్ బాస్ ప్రశ్నించగా ఆమె 1056 అని ఠక్కున కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందని అన్నాడు. రతిక కనుక ఐపీఎస్ ఎగ్జామ్ రాస్తే గ్యారెంటీగా జాబ్ కొడుతుందని పొగిడేశాడు. రతిక తనకి తాను 90 మార్కులు వేసుకోగా ఆడియన్స్ మాత్రం 80 మార్కులే ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్ డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణకు హోస్ట్ నాగార్జున క్లాస్ పీకారు. ఆయనతో పాటు శుభశ్రీపై పంచ్లు వేశారు. గౌతమ్ తనకు తాను 100 మార్కులు ఇచ్చుకోగా.. అసలు నువ్వేం చేశావని వందకు వంద వేసుకున్నావని నాగార్జున ప్రశ్నించారు. తన పర్ఫార్మెన్స్కు ఆడియన్ కేవలం 60 మార్కులే ఇచ్చానరి గాలి తీశాడు. కిరణ్ రాథోడ్ 100 మార్కులేసుకుంటే.. ఆడియన్స్ మాత్రం 58 మార్కులే వేశారు. అమర్ దీప్ 97 మార్కులేసుకోగా ప్రేక్షకులు 61 మార్కులు మాత్రమే ఇచ్చారని చెప్పాడు. అయితే ఆట సరిగా ఆడటం లేదని.. నాగార్జున 1 మార్క్ తేసేసి రౌండ్ ఫిగర్ 60 మార్కులు ఇచ్చాడు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ 78 మాస్కులు వేసుకుంటే ప్రేక్షకులు 74 మార్కులు ఇచ్చారని నాగ్ చెప్పాడు. శుభశ్రీ.. 98 మార్కులు ఇచ్చుకోగా ఆడియన్స్ 63 మార్కులు మాత్రమే వేశారు. మొత్తమ్మీద ఫస్ట్ వీక్ అసెస్మెంట్లో టాప్ స్కోరర్ గా నిలిచిన రతిక ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి ఆడియెన్స్ తో పాటు నాగార్జున ప్రశంసలు అందుకుంది.

Updated : 10 Sept 2023 9:08 AM IST
Tags:    
Next Story
Share it
Top