Bigg boss 7: హౌస్లో దొంగతనం.. అసలు బిగ్బాస్ కూడా ఊహించలే
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలివారం చప్పగా సాగగా.. ఈ వారం అదిరిపోయో మసాలా, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కు అందనుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోల ద్వారా వచ్చే ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది. గత సీజన్స్ తో పోల్చితే ఈ సీజన్ లో పోరు కొంత కొత్తగా ఉంది. నామినేషన్ ప్రక్రియ వేరే లెవెల్లో సాగుతుంది. కాగా బుధవారం ఎపిసోడ్ లో దొంగతనం జరిగినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి దొంగలు పడ్డారని ప్రోమో ద్వారా అర్థం అవుతుంది. బిగ్ బాస్.. పవర్ అస్త కోసం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ నిర్వహించాడు.
దాన్ని దక్కించుకోవడం కోసం టాస్క్ లో భాగంగా రణధీర, మహాబలి పేర్లతో రెండు టీంలను విభజించాడు బిగ్ బాస్. రణధీర గ్రూప్ లోని అమర్ దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్, షకీలా, శోభాశెట్టి.. ఓ తాళం చెవి గెలుచుకున్నారు. ఆ తాళాన్ని రాత్రి అందరు పడుకున్న తర్వాత దొంగిలించేందుకు మహాబలి టీం ఓ స్కెచ్ వేసింది. అయితే ఆ తాళాన్ని శివాజి ఓ గుడ్డలో పెట్టి, నడుముకు కట్టుకుని పడుకున్నాడు. అయితే తెగించిన రతిక కీని ఎలాగైనా దొంగిలించాలని ప్రయత్నించింది. ఇవన్నీ ప్రోమోలో చూపించగా.. అసలు హౌస్ లో ఏం జరిగింది? టాస్క్ లో ఎవరు గెలిచారన్న విషయం ఇవాళ వచ్చే ఎపిసోడ్ లో చూడాలి.