Home > సినిమా > నాలుగో సారి మాస్‌ కాంబో రిపీట్...అభిమానులకు పండగే..

నాలుగో సారి మాస్‌ కాంబో రిపీట్...అభిమానులకు పండగే..

నాలుగో సారి మాస్‌ కాంబో రిపీట్...అభిమానులకు పండగే..
X

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో మాస్ మహారాజా రవితేజ-ద‌ర్శ‌కుడు గోపీచంద్ జోడి ఒకటి. వీరిద్దరు కాంబోలో వచ్చిన మూడు సినిమాలు విజయాలు సాధించాయి. డాన్‌శీను, బ‌లుపుతో పాటు క్రాక్ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్‌గా నిలిచాయి. అదే జోరును కొనసాగించేందుకు ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని క‌లిసి నాలుగోసారి జతకట్టారు. వారి సినిమాపై ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ మేరకు RT 4 GM పేరుతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ మనుపటి సినిమాలకంటే పవరఫుల్ గా ఉంటుందని పోస్టర్‎లో పేర్కొన్నారు. చుండూరు అనే గ్రామం మొత్తం కాలిపోయి శ్మశానంలా ఉండడం పోస్టర్‌లో కనిపిస్తోంది. రవితేజను మాస్ క్యారెక్టర్‌లో గోపీచంద్ మలినేని ప్రెజెంట్ చేయనున్నాడని సమాచారం. రవితేజ, గోపీచంద్ మలినేని గత చిత్రాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

రవితేజ ప్రస్తుతం వంశీ డైరెక్షన్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు. ప్యాన్ ఇండియాలో రేంజ్‌లో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు ను దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

Updated : 9 July 2023 2:59 PM IST
Tags:    
Next Story
Share it
Top