Tiger Nageshwara Rao :రవితేజ మూవీ మాస్ అప్డేట్..మొదటి పాట 'ఏక్ దమ్' ఉంది భయ్యా..
X
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంశీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మేకర్స్ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనకున్నా, సలార్ రేస్ నుంచి తప్పుకోవడంతో సెప్టెంబర్ నెల చివర్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడును పెంచింది. పాన్ ఇండియా లెవెల్ సినిమా కావడంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలోనూ మూవీ టీమం పక్కా ప్లాన్ చేయాల్సి ఉంది. అయితే ఇంత కొద్ది సమయంలో ఇదంతా సాధ్యమా అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
టైగర్ నాగేశ్వరరావు సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే రోజు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుందన్న దానిపై ఎలాంటి సంకేతాలైతే లేవని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాన్ని పక్కన పెడితే... తాజాగా మేకర్స్ ప్రమోషన్లను మెళ్లిగా మొదలెట్టేశారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ఏక్ ధమ్ ..ఏక్ ధమ్ అంటూ సాగే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ పాట ఫుల్ లెన్త్ లిరికల్ వీడియో రేపు విడుదల కాబోతోంది. నుపుర్ సనన్, రవితేజతో తీసిన ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజతో జోడీ కట్టింది. అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్ వంటి వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.సెప్టెంబర్ 28న టైగర్ నాగేశ్వరరావు వెండితెర మీద సందడి చేయనుంది.